WTC final 2025 : స్ట్రాట‌జీలు మొద‌లు.. ఫైన‌ల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే తుది జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన ఆసీస్‌, ద‌క్షిణాఫికా..

డ‌బ్ల్యూటీసీ 2025 ఫైన‌ల్ మ్యాచ్ బుధ‌వారం నుంచి ప్రారంభం కానుంది.

Australia and South Africa announced playing XI's one day before WTC final 2025

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న డ‌బ్ల్యూటీసీ 2025 ఫైన‌ల్ మ్యాచ్ బుధ‌వారం (జూన్ 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌ద కోసం పోటీప‌డ‌నున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఒక్క సారి కూడా ఐసీసీ ట్రోఫీని నెగ్గ‌లేదు. ఈ క్ర‌మంలో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ గెలిచి ఆ లోటును తీర్చుకోవాల‌ని స‌పారీలు భావిస్తున్నారు. మ‌రోవైపు ఆస్ట్రేలియా జ‌ట్టు వ‌రుస‌గా రెండో సారి డ‌బ్ల్యూటీసీ విజేత‌గా నిల‌వాల‌ని కోరుకుంటుంది. ఈ క్ర‌మంలో మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవ‌కాశం ఉంది.

WTC final 2025 : డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ డ్రా అయితే ప‌రిస్థితి ఏంటి? ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాల‌లో టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌ద‌ను సొంతం చేసుకునేది ఎవ‌రంటే?

కాగా.. అటు ద‌క్షిణాప్రికా, ఇటు ఆస్ట్రేలియా జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే త‌మ త‌మ తుది జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.

ఆస్ట్రేలియా జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. జ‌ట్టు స్టార్ ఆట‌గాడు మార్న‌స్ ల‌బుషేన్‌ను ఓపెన‌ర్‌గా దింపుతోంది. అత‌డితో పాటు రెగ్యుల‌ర్ ఆట‌గాడు ఉస్మాన్ ఖ‌వాజా ఓపెన‌ర్‌గానే బ‌రిలోకి దిగ‌నున్నారు. వ‌న్‌డౌన్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన కామెరూన్ ఆడ‌నున్నాడు. ఇక ఇంత‌క‌ముందు క‌మిన్స్ అన్న‌ట్లుగానే స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలోనే ఆడ‌నున్నాడు.

ఆ త‌రువాత ఐదో స్థానంలో ట్రావిస్ హెడ్, ఆరో స్థానంలో బ్యూ వెబ్‌స్టర్, ఏడో స్థానంలో వికెట్ కీప‌ర్ అలెక్స్ క్యారీలు బ‌రిలోకి దిగ‌నున్నారు. పాట్ క‌మిన్స్‌, జోష్ హేజిల్‌వుడ్‌, మిచెల్ స్టార్క్‌ల‌తో కూడిన పేస్ విభాగం చాలా ప‌టిష్టంగా క‌నిపిస్తోంది. ఇక ఏకైక స్పిన్న‌ర్‌గా నాథ‌న్ లియోన్‌కు చోటు ద‌క్కింది.

Jasprit Bumrah : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. అరుదైన రికార్డుపై జ‌స్‌ప్రీత్ బుమ్రా క‌న్ను..

ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే..
ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఇదే..
ఐడెన్ మార్‌క్ర‌మ్‌, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్‌కీప‌ర్‌), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి