Australia captain Alyssa Healy announces retirement to play farewell series vs India
Alyssa Healy : ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సిరీస్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అవుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు భారత్‌తో జరిగే బహుళ ఫార్మాట్ సిరీసే తనకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఖరిది అని తెలిపింది.
మరికొన్నాళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలనే ఆకాంక్ష ఉన్నప్పటికి కూడా జట్టులో ఉన్న పోటీతత్వం కారణంగా తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. గత సంవత్సరం మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) సమయంలో తాను ఆటను ఆపాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించానని హీలీ వెల్లడించింది.
ఓ పాడ్‌కాస్ట్‌లో అలిస్సా హీలీ మాట్లాడుతూ.. మానసికంగా చాలా అలసిపోయాను. రానున్న భారత సిరీస్‌లో చివరి సారిగా కనిపిస్తాను. అయితే.. నాకు ఇంకొన్నాళ్ల పాటు ఆసీస్ తరుపున ఆడాలని అనిపిస్తోంది. కానీ.. ప్రారంభం నుంచి నన్ను ముందుకు నడిపిస్తున్న పోటీతత్వాన్ని కొంత కోల్పోయాను. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంది.
ప్రస్తుతం తాను టీ20 జట్టులో లేనని చెప్పింది. కాబట్టి భారత్ తో టీ20 సిరీస్‌ను ఆడలేనని చెప్పింది. అయితే.. టెస్టు, వన్డే కెప్టెన్‌గా తన కెరీర్‌ను స్వదేశంలో భారత్‌తో ఆడుతూ ముగించబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.
2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అలిస్సా హీలీ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరుపున 10 టెస్టులు, 123 వన్డేలు, 162 టీ20 మ్యాచ్లు ఆడింది. టెస్టుల్లో 30.6 సగటుతో 489 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 36 సగటుతో 3563 పరుగులు చేసింది. ఇందులో ఏడు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 25.4 సగటుతో 3054 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.