Australia fast bowler Kane Richardson announced retirement from professional cricket
Kane Richardson : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ కేన్ రిచర్డ్‌సన్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల ఈ ఆటగాడు 2021లో ఆసీస్ గెలిచిన టీ20 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 2013లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ పేసర్ ఆసీస్ తరుపున 25 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. మొతంగా అతడు 84 వికెట్లు సాధించాడు.
‘అరంగ్రేటం నుంచి ఇప్పటి వరకు నా క్రికెట్ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. నా ప్రయాణంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కష్టమే అయినప్పటికి వీడ్కోలుకి ఇది సరైన సమయం అని భావిస్తున్నాను.’ అని రిచర్డ్ సన్ ఓ ప్రకటనలో తెలిపాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను పాక్ బహిష్కరిస్తే ఐసీసీ తీసుకునే చర్యలు ఇవే..?
డెత్ ఓవర్లలో అత్యుత్తమ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రిచర్డ్ సన్.. 2016 జనవరిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులకు ఐదు వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. అతడు 2019 వన్డే ప్రపంచ కప్ ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికి కూడా బిగ్‌బాష్, దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డును కలిగి ఉన్నాడు. ఇక ఆసీస్ దేశవాళీ లీగ్ బిగ్‌బాష్ అరంగ్రేటం నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో కేన్ రిచర్డ్‌సన్ ఒకడు. బీబీఎల్‌లో 142 వికెట్లు తీసి లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు.
రిచర్డ్‌సన్ తన కెరీర్‌లో ఎక్కువగా గాయాలతో సావాసం చేశాడు. అయినప్పటికి ప్రపంచ వ్యాప్తంగా పలు టీ20లీగుల్లో ఆడాడు.