WTC Table: అయ్యో.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్ ప్లేస్.. దక్షిణాఫ్రికా నయం

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఆగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. భారత్ పై విజయం తరువాత ..

Teamindia

WTC Points Table: ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ లలో చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియా జట్టు గేమ్ ను ముగించేసింది. తద్వారా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు స్థానం దిగజారిపోయింది. ఆడిలైడ్ టెస్టు ముందు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 61.11శాతంతో తొలి స్థానంలో ఉండేది. కానీ, పింక్ బాల్ టెస్టులో ఓటమి తరువాత భారత్ మూడో ప్లేస్ కు పడిపోయింది.

Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో పింక్‌బాల్‌ టెస్టు.. భారత్ జట్టు ఘోర పరాజయం

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఆగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. భారత్ పై విజయం తరువాత ఆస్ట్రేలియా 57.69 శాతం నుంచి 60.71 శాతానికి పెరిగింది. తద్వారా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక దక్షిణాఫ్రికా 59.26 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతుంది. భారత్ జట్టు 57.29 పాయింట్లతో మూడో స్థానంకు పడిపోయింది. శ్రీలంక 50శాతంతో నాల్గో స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జట్టు 45.24శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.

Also Read: IND vs AUS : టెస్టు ఫార్మాట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. వారిద్దరి తరువాత హిట్‌మ్యానే

ఆస్ట్రేలియా – ఇండియా జట్ల మధ్య మరో మూడు టెస్టు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ మూడింటిలో ఒక్క టెస్టు ఓడిపోయినా భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు క్లిష్టతరం కానున్నాయి. వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తే మిగిలిన జట్ల విజయావకాశాలపై ఆధారపకుండా భారత్ జట్టు ఫైనల్ కు చేరే అవకాశం ఉంటుంది.