IND vs AUS : ఆస్ట్రేలియాతో పింక్‌బాల్ టెస్టు.. భారత్ జట్టు ఘోర పరాజయం
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది.

Australia
IND vs AUS 2nd Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది. పింక్ బాల్ తో జరిగిన ఐదు రోజుల డేనైట్ మ్యాచ్ లో మూడు రోజులకే ఆస్ట్రేలియా గేమ్ ను ముగించి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. రెండోరోజు (శనివారం) భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్, నితీశ్ కుమార్ ఉన్నారు. అయితే, మూడోరోజు (ఆదివారం) ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రిషబ్ పంత్ (28) ఔట్ అయ్యాడు. నితీశ్ కుమార్ (42) కాస్త పోరాడటంతో భారత్ కు ఇన్నింగ్స్ ఓటమి తప్పింది. మొత్తానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 175 పరుగులు చేయగలిగింది. దీంతో కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు వికెట్ నష్టపోకుండానే విజయం సాధించింది. మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.
చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులో భారత్ విజయం సాధించింది. అయితే, ఆడిలైట్ లో పింక్ బాల్ తో జరిగిన డేనైట్ రెండో టెస్టులో మాత్రం ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ముఖ్యంగా బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ లలో పరుగులు రాబట్టడంతో ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రెండు ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్ స్కోర్ ను దాటలేక పోయారు. నితీశ్ కుమార్, రిషబ్ పంత్ కాస్త పర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, శుభ్ మన్ గిల్ భారీ పరుగులు రాబట్టడంలో చేతులెత్తేశారు.
భారత్ జట్టు :
తొలి ఇన్నింగ్స్ : 180
రెండో ఇన్నింగ్స్ : 175
ఆస్ట్రేలియా జట్టు:
తొలి ఇన్నింగ్స్ : 337
రెండో ఇన్నింగ్స్ : 19/0
Massive win in Adelaide for Australia as they level the series 1-1 💪#WTC25 | #AUSvIND 📝: https://t.co/D4QfJY2DY1 pic.twitter.com/RXZusN98wU
— ICC (@ICC) December 8, 2024