2019 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..

2019 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..

Updated On : April 15, 2019 / 8:06 AM IST

వరల్డ్ కప్ జట్టులో స్టీవ్ స్మిత్.. డేవిడ్ వార్నర్ లకు మరో అవకాశమిచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఏడాది నిషేదం తర్వాత వరల్డ్ కప్ జట్టులో వారికి స్థానం కల్పించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్  కారణంగా ఏడాది పాటు నిషేదానికి గురైయ్యారు. వారు లేని లోటు ఆసీస్ జట్టులో స్పష్టంగా కనిపించింది. 
Read Also : పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే

ఇందుకేనేేమో.. మే 30నుంచి ఇంగ్లాండ్ వేదికగా మొదలుకానున్న వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. డేవిడ్ వార్నర్.. స్టీవ్ స్మిత్‍‌లను జట్టులోకి తీసుకుని 15 మందితో కూడిన జాబితా రిలీజ్ చేసింది. 

 

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోనిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్‌సన్, నాథన్ కౌల్టర్ నైల్, జాసన్ బహ్రెండార్ఫ్, నాథన్ లైన్, ఆడం జంపా.
Read Also : జట్టు నుంచి ఔట్ : రాయుడు, పంత్‌కు బీసీసీఐ షాక్

ఆ ఘటనలో నిషేదం ఎదుర్కొన్న ముగ్గురిలో వార్నర్, స్మిత్‌లు మాత్రమే తిరిగి స్థానం దక్కించుకోగా బాన్ క్రాఫ్ట్‌కు చేదు అనుభవమే ఎదురైంది. 

 

Read Also : జియో స్పెషల్ ఆఫర్ : IPL క్రికెట్ 4G డేటా ప్లాన్ ఇదే