బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిక్కీ ఎడ్వర్డ్స్ వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది. బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్ తలకు తగలబోయి కాస్తలో మిస్సయింది. న్యూ సౌత్ వేల్స్ వర్సెస్ క్వీన్స్ ల్యాండ్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దేశీవాలీ వన్డే టోర్నీలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో క్వీన్స్ ల్యాండ్ బ్యాటింగ్ చేస్తుంది.
బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ జట్టు బౌలర్‌గా మిక్కీ ఎడ్వర్డ్స్ ఉన్నాడు. ఫుల్ డెలీవరి ఒకటి విసిరాడు. దానిని ప్లాట్ అండ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడిన హీజ్లెట్ షాట్‌తో బంతి నేరుగా తలకు వచ్చి తగలబోయింది. క్షణాల్లో బౌలర్ చేయి అడ్డుపెట్టుకుని దిశను మార్చడంతో కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాడు. ఆ తర్వాత లేచి తన కుడి చేయి బాగానే ఉందో లేదో చూసుకుంటూ ఉండిపోయాడు.
గాయంతో పాటు మ్యాచ్ ఓడిన బాధ ఎడ్వర్డ్స్‌కు ఎక్కువగా బాధించింది. 9ఓవర్లు బౌలింగ్ వేసి 61పరుగులు ఇవ్వడంతో పాటు వికెట్లు పడగొట్టలేకపోయాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూ సౌత్ వేల్స్ 5వికెట్ల నష్టానికి 305పరుగులు చేసింది. చేధనకు దిగిన క్వీన్స్ ల్యాండ్ 6వికెట్ల నష్టానికి 307పరుగులు చేయగలిగింది. ఫలితంగా క్వీన్స్ ల్యాండ్ 12బంతులు మిగిలి ఉండగానే 4వికెట్ల తేడాతో గెలుపొందింది.
Thankfully, Mickey Edwards is OK after this scary moment at AB Field #MarshCup pic.twitter.com/lhuMm8lyjo
— cricket.com.au (@cricketcomau) September 22, 2019