Michael Clarke : ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు మైఖేల్ క్లార్క్‌కు క్యాన్స‌ర్‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోటోని షేర్ చేస్తూ..

ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు మైఖేల్ క్లార్క్ (Michael Clarke) క్యాన్స‌ర్ వ్యాధి బారిన ప‌డ్డాడు. అత‌డు చ‌ర్మ క్యాన్స‌ర్‌తో..

Australian Cricket Legend Michael Clarke Diagnosed With Skin Cancer

Michael Clarke : ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు మైఖేల్ క్లార్క్ (Michael Clarke) క్యాన్స‌ర్ వ్యాధి బారిన ప‌డ్డాడు. అత‌డు చ‌ర్మ క్యాన్స‌ర్‌(Skin Cancer)తో బాధ‌ప‌డుతున్నాడు.

ఈ విష‌యాన్ని అత‌డు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరాడు.

‘అవును నాకు చ‌ర్మ క్యాన్స‌ర్‌. ఈ రోజు నా ముక్కు నుంచి మ‌రొక భాగాన్ని క‌త్తిరించారు. ఓ స్నేహితుడిగా చెబుతున్నాను. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించండి. ప‌రీక్ష‌లు చేయించుకోండి. రోగం వ‌చ్చిన త‌రువాత చికిత్స చేయించుకోవ‌డం క‌న్నా అస‌లు రాకుండా చూసుకోవ‌డం ముఖ్యం. ఇక నా విష‌యంలో క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం, ముందస్తుగా గుర్తించ‌డం ముఖ్య విష‌యం.’ అని క్లార్క్ రాసుకొచ్చాడు.

Hanuma Vihari : హ‌నుమ విహారి కీల‌క నిర్ణ‌యం.. ఆంధ్రాకు గుడ్ బై.. కొత్త అధ్యాయం మొద‌లు అంటూ..

ఈ విష‌యం తెలిసిన క్రికెట్ అభిమానులు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

ఆస్ట్రేలియా త‌రుపున ఆడిన అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో మైఖేల్ కార్ల్క్ ఒక‌డు. ఆసీస్ త‌రుపున 115 టెస్టులు, 245 వ‌న్డేలు, 34 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

టెస్టుల్లో 49.1 స‌గ‌టుతో 8643 ప‌రుగులు చేశాడు. ఇందులో 28 శ‌త‌కాలు, 27 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 44.6 స‌గ‌టుతో 7981 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 శ‌త‌కాలు, 58 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. టీ20ల్లో 21.2 స‌గ‌టుతో 488 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ‌శ‌త‌కం ఉంది. ఇక ఐపీఎల్‌లో కేవ‌లం 6 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 94 ప‌రుగులు సాధించాడు.