Australian Open 2025 Lakshya Sen enter into final
Australian Open 2025 : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం సిడ్నీ వేదికగా జరిగిన సెమీస్‌లో (Australian Open 2025) చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ ఆరో ర్యాంక్ చౌ టియెన్ చెన్ విజయం సాధించాడు. 86 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 17-21, 24-22, 21-16 తేడాతో లక్ష్య సేన్ విజయం సాధించాడు.
ఈ మ్యాచ్ ఆరంభంలో 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన లక్ష్య సేన్ ఇబ్బంది పడ్డాడు. తొలి గేమ్‌ను కోల్పోయాడు. అయితే.. ఆ తరువాత పుంజుకున్న లక్ష్య సేన్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు గేమ్‌లలో విజయం సాధించి ఫైనల్ కు దూసుకువెళ్లాడు.
What A Save By Lakshya Sen ❤️💥
📸 : BWF YT#AustraliaOpen2025 https://t.co/WPyZhBVFY6 pic.twitter.com/G1IHuXGtuC
— Badminton Media (@BadmintonMedia1) November 22, 2025
ఈ ఏడాది ప్రారంభంలో హాంకాంగ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికి కూడా లక్ష్య సేన్ టైటిల్‌ను సాధించలేదు. ఈ సీజన్‌లో అతడు ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ను గెలవలేదు.
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతడు జపాన్‌కు చెందిన యుషి తనకా లేదా చైనీస్ తైపీకి చెందిన ఐదవ సీడ్ లిన్ చున్-యితో తలపడనున్నాడు.