Mitchell Starc Retirement : ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం.. టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై.. కారణం ఇదేనట..
mitchell starc retirement : ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

mitchell starc retirement
mitchell starc retirement : ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
35ఏళ్ల స్టార్క్ 2024 టీ20 వరల్డ్‌కప్ నుంచి టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. ఇకపై టెస్టులు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే, ఐపీఎల్ సహా దేశవాలీ టీ20 లీగ్ లకు అందుబాటులో ఉంటానని చెప్పాడు.
2012లో అంతర్జాతీయ టీ20ల్లో స్టార్క్ అరంగ్రేటం చేశాడు. ఈ ఫార్మాట్ లో 65 మ్యాచ్‌లు ఆడిన అతను.. 79 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా స్టార్క్ తన రిటైర్మెంట్ సందేశాన్ని ఇచ్చాడు. టీ20 కెరీర్‌లో ప్రతి మ్యాచ్‌ను, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని పేర్కొన్నాడు. ఇందులో 2021 వరల్డ్‌కప్ హైలెట్‌గా ఉంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా తరపున టీ20 ఫార్మాట్‌ను ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే.. టెస్టులకే తన మొదటి ప్రాధాన్యత అని స్టార్క్ చెప్పుకొచ్చాడు.
భారత పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వరల్డ్ కప్ కోసం ఎదరు చూస్తున్నానని చెప్పాడు. పై టోర్నీలకు ఫిట్‌గా, ఫ్రెష్‌గా ఉండేందుకు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిచడం జరిగిందని చెప్పాడు.
🚨 MITCHELL STARC HAS ANNOUNCED HIS RETIREMENT FROM T20I 🚨
– He will focus on Tests & ODIs, Thank you Cricket Icon. pic.twitter.com/UUc0S5iceC
— Johns. (@CricCrazyJohns) September 2, 2025
View this post on Instagram