Tilak Varma : మెగాటోర్నీ నుంచి త‌ప్పుకున్న తిల‌క్ వ‌ర్మ‌..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ (Tilak Varma) దులీప్ ట్రోఫీకి దూరం కానున్నాడు. అత‌డి స్థానంలో కేర‌ళ బ్యాట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్

Tilak Varma : మెగాటోర్నీ నుంచి త‌ప్పుకున్న తిల‌క్ వ‌ర్మ‌..

Tilak Varma Leaves Duleep Trophy For Asia Cup 2025

Updated On : August 31, 2025 / 5:38 PM IST

Tilak Varma : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ దులీప్ ట్రోఫీకి దూరం కానున్నాడు. ఆసియాక‌ప్ 2025 జ‌ట్టులో చోటు ద‌క్క‌డంతో అత‌డు దులీప్ ట్రోఫీ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌డం లేదు. నార్త్‌జోన్‌తో జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్‌కు తిల‌క్ వ‌ర్మ (Tilak Varma) నాయ‌క‌త్వం వ‌హించాల్సి ఉంది.

కాగా.. తిల‌క్ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో కేర‌ళ బ్యాట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లను అప్ప‌గించారు. త‌మిళ‌నాడుకు చెందిన ఎన్ జ‌గ‌దీశ‌న్‌ను వైస్ కెప్టెన్‌గా నియ‌మించారు. ఈ మ్యాచ్ సెప్టెంబ‌ర్ 4 నుంచి 7 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

Sri Lanka : శ్రీలంక జ‌ట్టుకు ఐసీసీ షాక్‌.. భారీ జ‌రిమానా..

త‌మిళ‌నాడు చెందిన ఎడ‌మ‌చేతి వాటం స్పిన్న‌ర్ సాయి కిషోర్ కూడా ఈ టోర్న‌మెంట్‌కు దూరం కానున్నాడు. చేతి గాయం నుంచి అత‌డు ఇంకా కోలుకోక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం. ఈక్ర‌మంలో తిల‌క్‌, సాయి కిషోర్‌ స్థానంలో అంకిత్ శర్మ‌, షేక్ రషీద్ లను సౌత్ జోన్ సెలెక్ట‌ర్లు ఎంపిక చేశారు.

మార్పుల త‌రువాత సౌత్‌ జోన్ జట్టు ఇదే..
మహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాన విజయ్, తనయ్ త్యాగరాజన్, విజయ్‌కుమార్ వ్యాషాక్, నిధీష్ MD, రికీ సింఘ్నేత్, జికర్నెట్, జికర్నెట్, జికర్నెట్, భుయీ అంకిత్ శర్మ, షేక్ రషీద్.

DPL 2025 : దిగ్వేష్ రాఠీతో వివాదంపై స్పందించిన‌ నితీశ్‌ రాణా.. నన్ను రెచ్చ‌గొడితే ఊరుకోను..

స్టాండ్‌బై ఆట‌గాళ్లు..
మోహిత్ రెడ్కర్, ఆర్ స్మరన్, ఈడెన్ యాపిల్ టామ్, ఆండ్రీ సిద్దార్థ్.

సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 ప్రారంభం కానుంది. టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబ‌ర్ 10న త‌ల‌ప‌డ‌నుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ సెప్టెంబ‌ర్ 14న జ‌ర‌గ‌నుంది. లీగ్ ద‌శ‌లో భార‌త్ చివ‌రి మ్యాచ్‌ను ఒమ‌న్‌తో సెప్టెంబ‌ర్ 19న ఆడ‌నుంది.