DPL 2025 : దిగ్వేష్ రాఠీతో వివాదంపై స్పందించిన‌ నితీశ్‌ రాణా.. నన్ను రెచ్చ‌గొడితే ఊరుకోను..

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్ 2025 (DPL 2025) ప్రస్తుతం వార్త‌ల్లో బాగా నిలుస్తోంది. అయితే.. అది మ్యాచ్‌ల ద్వారా మాత్రం కాదు

DPL 2025 : దిగ్వేష్ రాఠీతో వివాదంపై స్పందించిన‌ నితీశ్‌ రాణా.. నన్ను రెచ్చ‌గొడితే ఊరుకోను..

DPL 2025 Nitish Rana opens up on fight with Digvesh Rathi

Updated On : August 31, 2025 / 3:07 PM IST

DPL 2025 : ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్ 2025 ప్రస్తుతం వార్త‌ల్లో బాగా నిలుస్తోంది. అయితే.. అది మ్యాచ్‌ల ద్వారా మాత్రం కాదు. ఆ లీగ్‌లో చోటు చేసుకుంటున్న వివాదాల కార‌ణంగా. ఈ లీగ్‌(DPL 2025)లో ఆట‌గాళ్లు హ‌ద్ద‌లు మీరుతున్నారు. కొన్ని సార్లు కొట్టుకునే వ‌ర‌కు వెళ్లారు. ఇక శుక్రవారం వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జ‌ట్ల మ‌ధ్య‌ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు నితీష్ రాణా, దిగ్వేష్ రాఠి వాగ్వాదానికి దిగారు.

దీంతో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌గా, ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు క‌లగజేసుకుని ప‌రిస్థితిని స‌ద్ధుమ‌ణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వారిద్ద‌రికి డీపీఎల్ నిర్వాహ‌కులు జ‌రిమానా విధించారు. దిగ్వేష్ రాఠి మ్యాచ్ ఫీజులో 80 శాతం జ‌రిమానా విధించ‌గా, నితీశ్ రాణా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు.

Babar Azam : ఆసియాక‌ప్‌లో నో ప్లేస్‌.. స్పిన్న‌ర్‌గా మారిన బాబ‌ర్ ఆజామ్‌.. సూప‌ర్ డెలివ‌రీతో క్లీన్ బౌల్డ్‌! వీడియో

ఇక గొడ‌వ‌పై తాజాగా నితీశ్ రాణా స్పందించాడు. త‌న‌ను ఎవ‌రైనా రెచ్చ‌గొడితే వెన‌క్కి త‌గ్గ‌న‌ని స్ప‌ష్టం చేశాడు. ‘ఇక్క‌డ ఎవ‌రు త‌ప్పు చేశారు? ఎవ‌రు త‌ప్పు చేయ‌లేదు? అనేది విష‌యం కాదు. అత‌డు త‌న జ‌ట్టును గెలిపించ‌డానికి వ‌చ్చాడు. నేను నా జ‌ట్టును గెలిపించ‌డానికి వ‌చ్చాను. క్రికెట్ స్ఫూర్తిని నిలిపేలా గౌర‌వించ‌డం అంద‌రి బాధ్య‌త.’ అని రాణా అన్నాడు.

Alex Hales : టీ20 క్రికెట్‌లో అలెక్స్ హేల్స్ అరుదైన ఘ‌న‌త‌.. క్రిస్ గేల్, కీరాన్ పొలార్డ్ ల ఎలైట్ లిస్ట్‌లో చోటు..

ఇక దిగ్వేష్ తొలుత గొడ‌వ మొద‌లు పెట్టిన‌ట్లుగా రాణా చెప్పుకొచ్చాడు. ఎవ‌రైనా స‌రే త‌న‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌వ‌ర్తిస్తే మాత్రం తాను నిశ్శ‌బ్దంగా కూర్చోన‌ని చెప్పాడు. త‌న విష‌యాల్లో క‌ల‌గ‌జేసుకుంటే కేవ‌లం మాట‌ల‌తోనే కాదు, బ్యాట్‌తోనూ స‌మాధానం చెబుతాను అని అన్నాడు. ఇందుకు డీపీఎల్‌లో ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఉదాహ‌ర‌ణ అని తెలిపాడు.