2032 Olympic Games : బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్ గేమ్స్‌

ఆస్ట్రేలియా నగరమైన బ్రిస్బేన్ 2032 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్రకటించింది. 2000 సంవ‌త్స‌రంలో సిడ్నీలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి.

Australia’s Brisbane 2032 Olympic Games : ఆస్ట్రేలియా నగరమైన బ్రిస్బేన్ 2032 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్రకటించింది. 2000 సంవ‌త్స‌రంలో సిడ్నీలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి. మ‌ళ్లీ 32 ఏళ్ల విరామం ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ క్రీడ‌లు జ‌ర‌గ‌నున్నాయి. 1956లో ఒలింపిక్స్‌కు మెల్‌బోర్న్ ఆతిథ్యం ఇచ్చింది. బ్రిస్బేన్, క్యూన్స్ ల్యాండ్‌లకు చారిత్రాత్మక రోజు మాత్రమే కాదని, దేశమొత్తానికి సంబంధించినదని ప్రధాని స్కాట్ మారిసన్ పేర్కొన్నారు.

ఒలింపిక్స్ గేమ్స్ కు గ్లోబల్ సిటీలు మాత్రమే సురక్షితమైనవి అన్నారు. ప్రపంచంలో ఒలింపిక్స్ కు ఆతిథ్య నగరంగా బ్రిస్బేన్ కు మంచి గుర్తింపు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఫిబ్రవరి నెలలోనే క్యూన్స్ ల్యాండ్ స్టేట్ నగరమైన బ్రిస్బేన్ కు ప్రాధాన్యత ఇచ్చారు. సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ మూడు వేర్వేరు నగరాల్లో ఆతిథ్యమివ్వగా.. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో దేశంగా ఆస్ట్రేలియా అవతరించింది. 2032 ఒలింపిక్స్ ఆతిథ్యమిచ్చేందుకు ఇండోనేషియా సహా అనేక నగరాలు, దేశాలు బహిరంగానే ఆసక్తి కనబర్చాయి. కానీ, బ్రిస్బేన్ నగరానికి మాత్రమే ఈ ఛాన్స్ దక్కింది.

ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 తేడాతో ఓట్లు వచ్చాయి. క్విన్స్ లాండ్స్ రాష్ట్రం 2018 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఖర్చులు తగ్గించుకునేందుకు నగరాలకు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి 2019లో IOC తన బిడ్డింగ్ నిబంధనలను సరిచేసింది. ఈ వారం వాయిదాపడిన 2020 ఒలింపిక్స్‌కు టోక్యో ఆతిథ్యం ఇస్తోంది. పారిస్ 2024 క్రీడలను నిర్వహించనుంది. అలాగే లాస్ ఏంజిల్స్‌కు 2028 సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించనుంది.

ట్రెండింగ్ వార్తలు