Babar Azam: ఆసియా క‌ప్‌, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇలాంటి రిస్క్‌లు అవ‌స‌ర‌మా..! కెప్టెన్సీ నుంచి తీసేయండి..?

పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం(Babar Azam) ఇటీవ‌ల ఓ కొత్త బీఎండ‌బ్ల్యూ స్పోర్ట్స్ బైక్‌ను తీసుకున్నాడు. ఈ బైక్‌పై లాహోర్‌లోని వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు.

Babar Azams motorbike ride: పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం(Babar Azam) ఇటీవ‌ల ఓ కొత్త బీఎండ‌బ్ల్యూ స్పోర్ట్స్ బైక్‌ను తీసుకున్నాడు. ఈ బైక్‌పై లాహోర్‌లోని వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. బైక్ న‌డుపున్న వీడియోను అభిమానుల‌తో పంచుకుంటూ Ready, set, GO అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీన్ని చూసిన పాక్ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.

హెల్మెట్‌తో ధ‌రించ‌డంతో పాటు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని బాబ‌ర్ బైక్ న‌డుపుతున్నా కూడా అభిమానులు ఎందుకు ఆందోళ‌న ప‌డుతున్నార‌ని అంటారా..? మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా న‌డిపినా స‌రే టైమ్ బాగోలేక‌పోతే ఏమైనా జ‌ర‌గొచ్చు క‌దా. భార‌త క్రికెటర్ రిష‌బ్ పంత్ లాగా బాబ‌ర్ గాయ‌ప‌డితే పాక్ టీమ్‌కు క‌ష్ట‌మే.

Asia Cup 2023: బీసీసీఐ దెబ్బకు పాకిస్థాన్ చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం..! శ్రీలంకలో నిర్వహించే అవకాశం

ఆసియా క‌ప్‌తో పాటు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలు ముందు ఉండ‌డంతో ఇలాంటి స‌మ‌యంలో ఎలాంటి రిస్క్‌లు తీసుకోకూడ‌ద‌ని బాబ‌ర్‌కు పాక్ అభిమానులు సూచిస్తున్నారు. అందుక‌నే బాబ‌ర్ బైక్ న‌డ‌ప‌డ‌డం పై కొంద‌రు అభిమానులు మండిప‌డుతున్నారు. వెంట‌నే అత‌డిని కెప్టెన్సీ నుంచి తీసేయండని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిష‌బ్ పంత్ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పంత్ కోలుకుంటున్నాడు. గాయం కార‌ణంగా ప‌లు కీల‌క సిరీస్‌ల‌తో పాటు ఐపీఎల్‌ను ఆడ‌లేక‌పోయాడు. రానున్న ఆసియా క‌ప్‌తో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు కూడా అత‌డు అందుబాటులో ఉండ‌డం అనుమాన‌మే. పంత్ దూరం కావ‌డం భార‌త విజ‌యావ‌కాశాల‌ను ప్ర‌భావితం చేస్తోంది.


IPL 2023: గౌతం గంభీర్‌ను పొగుడుతూ కోహ్లీ ఫ్యాన్స్‌కి మళ్లీ చిరాకు తెప్పించిన నవీన్ ఉల్ హక్

ట్రెండింగ్ వార్తలు