BAN vs IRE 2nd test day 1 stumps Mushfiqur Rahim in 100th Test as batter stuck on 99
BAN vs IRE : బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తరుపున టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఐర్లాండ్‌తో (BAN vs IRE) ఢాకా వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 నాలుగు వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. లిటన్ దాస్ 47 పరుగులతో ముష్ఫికర్ రహీమ్ 99 పరుగులతో క్రీజులో ఉన్నారు.
AUS vs ENG : ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ సవాల్.. తొలి టెస్టుకు రెండు రోజుల ముందే..
ఆఖరి ఓవర్‌లో హైడ్రామా..
తొలి రోజు ఆఖరి ఓవర్ సమయానికి ముష్ఫికర్ రహీమ్ 97 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడే స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్ గావిన్ హోయ్ ఆఖరి ఓవర్‌ను వేశాడు. తొలి రెండు బంతులు డాట్ అయ్యాయి. మూడో బంతికి ముష్ఫికర్ రహీమ్, నాలుగో బంతికి లిటన్ దాస్ లు సింగిల్ తీశారు. ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్ సింగిల్ తీయడంతో అతడు 99 పరుగులకు చేరుకున్నాడు.
అయితే.. ఇక్కడే ఐర్లాండ్ చిన్న గేమ్ ఆడింది. ఓవర్‌లోని ఆఖరి బంతి వేయడానికి కాస్త టైమ్ తీసుకుంది. దీంతో ఇదే చివరి ఓవర్ అయింది. అలా కాకుండా ఐర్లాండ్ తొందరగా ఆఖరి బంతిని వేసుకుంటే.. టైమ్ ఉండడంతో మరో ఓవర్‌ను వేయాల్సి వచ్చేది.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్.. జట్టుతో పాటు గౌహతి వెళ్తాడు గానీ..
కాగా.. వందో టెస్టులో వంద పరుగులు చేసేందుకు ముష్ఫికర్ రహీమ్ రేపటి వరకు వేచి చూడక తప్పదు. అతడు మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెలుతున్న క్రమంలో అభిమానులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
ముష్ఫికర్ రహీమ్ సెంచరీ సాధిస్తే.. వందో టెస్టులో సెంచరీ చేసిన 11వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.