BAN vs PAK : స‌ల్మాన్ అఘా ర‌నౌట్ పై మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ హాట్‌ కామెంట్స్‌.. కావాల‌నే చేశా.. అప్పుడు నేను ఆలోచించింది అదొక్క‌టే..

రెండో వ‌న్డేలో స‌ల్మాన్ అలీ అఘా ర‌నౌట్ పై (BAN vs PAK) మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ స్పందించాడు.

Mehidy Hasan Miraz comments on Salman Ali Agha run out

  • రెండో వ‌న్డేలో స‌ల్మాన్ అలీ అఘా ర‌నౌట్‌
  • స్పందించిన మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్‌
  • అప్పుడు అదొక్క‌టే ఆలోచిస్తున్నా

BAN vs PAK : ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదిక‌గా శుక్ర‌వారం బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆట‌గాడు స‌ల్మాన్ అలీ అఘా ర‌నౌట్ వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై బంగ్లాదేశ్ కెప్టెన్, ర‌నౌట్ చేసిన మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ స్పందించాడు.

‘అత‌డు క్రీజు దాటి చాలా ముందుకు ఉన్నాడు. ఆ స‌మ‌యంలో నేను బంతి కోసం చూస్తున్నాను. నేను బాల్ మిస్ చేస్తే అత‌డు ప‌రుగు తీసి ఉండేవాడు. ఆ స‌మ‌యంలో నేను ఇలాగే ఆలోచిస్తున్నాను.’ అని మ్యాచ్ అనంత‌రం ప్ర‌జెంటేష‌న్ లో మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ అన్నాడు.

BAN vs PAK : సూప‌ర్ ట్విస్ట్.. సాయం చేయ‌బోయే వికెట్ పాయె.. స‌ల్మాన్ అలీ ఫ్యూజులు ఔట్‌

అస‌లేం జ‌రిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో పాక్ ఇన్నింగ్స్ 39వ ఓవ‌ర్‌లో ఇది జ‌రిగింది. ఈ ఓవ‌ర్‌ను బంగ్లా బౌల‌ర్ మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని రిజ్వాన్ ఎదుర్కొన్నాడు. అత‌డు స్ట్రైయిట్ షాట్ ఆడాడు. బంతి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స‌ల్మాన్ అలీ అఘా షూని తాకింది. దీంతో బంతి డెడ్ అయింద‌ని భావించిన స‌ల్మాన్ బాల్‌ను మిరాజ్‌కు ఇద్దామ‌ని కింద‌కు వంగాడు.

Sanju Samson : సంజూ శాంస‌న్ ఫోటోను ఎడిట్ చేసిన శుభ్‌మ‌న్ గిల్..! మ‌రి అంత అసూయ ప‌నికిరాద‌య్యా..?

స‌ల్మాన్ వెనుక‌నే ఉన్న మిరాజ్‌.. వెంట‌నే బంతిని అందుకుని వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ఆపై స‌ల్మాన్ ర‌నౌట్ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్.. థ‌ర్డ్ అంపైర్ సాయం కోర‌గా.. రివ్యూను ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్ ర‌నౌట్ ఇచ్చాడు. తాను ఔటైన విధానంపై స‌ల్మాన్ ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మార‌గా.. కొంద‌రు స‌ల్మాన్‌ను స‌పోర్టు చేస్తుంటే మ‌రికొంద‌రు మిరాజ్‌ను స‌పోర్టు చేస్తున్నారు.