PAK vs BAN : ఈ పాక్ బ్యాట‌ర్ క‌ష్టాలు చూసి న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. ష‌కీబ్ చేతిలో బంతి.. క్రీజులోకి వ‌చ్చేందుకు..

పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజ‌యం దిశ‌గా దూసుకువెలుతోంది.

Bangladesh Tease Pakistan Star Abrar Ahmed Over Clumsy Entry

PAK vs BAN : పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజ‌యం దిశ‌గా దూసుకువెలుతోంది. 185 ప‌రుగుల ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 7 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 42 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు జకీర్ హసన్ (31), షెడ్‌మన్ ఇస్లామ్(9) లు ఉన్నారు. బంగ్లాదేశ్ విజ‌యానికి ఆఖ‌రి రోజు మ‌రో 143 ప‌రుగులు అవ‌స‌రం. ఏదైన అద్భుతం జ‌రిగితే త‌ప్ప పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం అసాధ్యం.

తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. రెండో టెస్టులోనూ గెలిస్తే.. రెండు మ్యాచుల సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయ‌నుంది ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 ప‌రుగులు చేసింది. దీంతో పాక్‌కు 12 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ద‌క్కింది.

Virender Sehwag : టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్‌.. ఐపీఎల్ కోచ్‌గా అయితే..

బంగ్లాదేశ్ బౌల‌ర్ల ధాటికి స్వ‌ల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్ 172 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బంగ్లా బౌల‌ర్ల‌లో హసన్ మహముద్ (5/43) ఐదు వికెట్లు తీయగా.. నహిద్ రాణా నాలుగు వికెట్ల‌తో రాణించాడు. ట‌స్కిన్ ఓ వికెట్ తీశాడు. పాక్ బ్యాట‌ర్ల‌లో అఘా స‌ల్మాన్ (47నాటౌట్‌), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (43)లు రాణించారు.

ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్‌..
నాలుగో రోజు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్ చేటు చేసుకుంది. హసన్ మహముద్ బౌలింగ్‌లో ఓ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి మ‌హ్మ‌ద్ అలీ(0) ఔట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 136 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అలీ ఔట్ కావ‌డంతో అబ్రార్ అహ్మద్ బ్యాటింగ్ కు రావాల్సి ఉంది. ఆ త‌రువాతి ఓవ‌ర్‌ను ష‌కీబ్ అల్ హ‌స‌న్ వేయ‌డానికి సిద్ధం అయ్యాడు. అయితే.. అప్ప‌టికి బ్యాటింగ్ కోసం అబ్రార్ సిద్ధం కాలేదు. స‌మ‌యం మించి పోతుండ‌డంతో ఎక్క‌డ త‌న‌ను ష‌కీబ్ ‘టైమ్డ్ ఔట్’ చేస్తాడోన‌ని హెల్మెట్‌, గ్లౌజ్‌ల‌ను చేతులో ప‌ట్టుకుని ప‌రిగెత్తుకుంటూ మైదానంలోకి వ‌చ్చాడు.

AUS vs IND : ఆ ఇద్దరు సీనియర్లు వ‌ద్దు.. ఈ ఇద్ద‌రు కుర్రాళ్లే ముద్దు..

అయితే.. అత‌డు ప‌రిగెత్తుకుంటూ గ్రౌండ్‌లోకి వ‌స్తూ హెల్మెట్ పెట్టుకునేట‌ప్పుడు చేతిలోని గ్లౌజ్ కింద‌ప‌డింది. మ‌ళ్లీ వెన‌క్కి వెళ్లి గ్లౌజ్ ప‌ట్టుకుని ప‌రిగెత్తుకుంటూ క్రీజుని చేరాడు. దీనిని చూసిన ష‌కీబ్‌తో పాటు ఫీల్డ‌ర్ల‌తో తెగ‌న‌వ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. గ‌తంలో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ ఏంజెలో మాథ్యూస్‌ను షకీబ్ అల్ హ‌స‌న్ టైమ్డ్ ఔట్‌గా ఔట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు