Virender Sehwag : టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్‌.. ఐపీఎల్ కోచ్‌గా అయితే..

టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌విపై త‌న‌కు ఆస‌క్తి లేద‌ని మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.

Virender Sehwag : టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్‌.. ఐపీఎల్ కోచ్‌గా అయితే..

Virender Sehwag shockingly says NO to India coaching job

టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌విపై త‌న‌కు ఆస‌క్తి లేద‌ని మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. అదే స‌మ‌యంలో ఐపీఎల్ టీమ్ కోచ్‌గా లేదంటే మెంటార్‌గా ఆఫ‌ర్ వ‌స్తే మాత్రం వ‌దులుకోన‌ని చెప్పాడు. ఇందుకు ఓ ముఖ్య‌మైన కార‌ణం ఉంద‌న్నాడు.

టీమ్ఇండియా హెచ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌డితే మ‌రోసారి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వ‌స్తుంద‌న్నాడు. ఏడాది పాటు భార‌త జ‌ట్టుతో పాటు ప్ర‌యాణాలు చేయాల్సి ఉంటుంద‌న్నాడు. ఆట‌గాడిగా ఆడిన స‌మ‌యంలో 15 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నాన‌ని చెప్పాడు. హెడ్ కోచ్ ప‌ద‌వి చేప‌డితే మ‌రోసారి ఇదే రిపీట్ అవుతుంద‌న్నాడు.

Maharaja T20 Trophy 2024 : చెల‌రేగిన క‌రుణ్‌నాయ‌ర్‌.. మ‌హారాజా ట్రోఫీ విజేత‌గా మైసూర్ వారియ‌ర్స్‌

త‌న‌కు 14, 16 ఏళ్ల వ‌య‌సు గ‌ల పిల్ల‌లు ఉన్నార‌ని, వారికి త‌న అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఇద్ద‌రూ క్రికెట్ ఆడుతున్నార‌న్నాడు. ఒక‌రు ఆఫ్ స్పిన్న‌ర్ కాగా మ‌రొక‌రు ఓపెనింగ్ బ్యాట‌ర్‌. వారికి తాను ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంద‌న్నాడు. వారితో మ‌రింత స‌మ‌యం గ‌డ‌పాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పడు. ఒక‌వేళ తాను టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వెళితే వాళ్ల‌ని ట్రైనింగ్ చేయ‌డం క‌ష్ట‌మవుతాద‌ని, అదే ఐపీఎల్ కోచ్‌గా అయితే పిల్ల‌ల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ఉంద‌ని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

15 ఏళ్ల పాటు భారత జట్టుకు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ టీమ్ఇండియా త‌రుపున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. 2015లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అనంత‌రం కామెంటేట‌ర్‌గా, పంజాబ్ కింగ్స్ మెంటార్‌గా, స‌పోర్ట్ స్టాఫ్‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ది క్రికెట‌ర్‌గా 2018 వ‌ర‌కు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. కాగా.. 2017లో టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే.. అప్ప‌టి క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ ర‌విశాస్త్రిని కోచ్‌గా నియ‌మించింది. ఆ త‌రువాత మ‌రోసారి హెడ్‌కోచ్ ప‌ద‌వికి సెహ్వాగ్ ద‌ర‌ఖాస్తు చేసుకోలేదు.

England : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో ఇంగ్లాండ్ అరుదైన ఘ‌న‌త‌..