Maharaja T20 Trophy 2024 : చెలరేగిన కరుణ్‌నాయర్.. మహారాజా ట్రోఫీ విజేతగా మైసూర్ వారియర్స్
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ విజేతగా నిలిచింది.

Mysore Warriors Crowned Maharaja Trophy Champions After Thrashing Bengaluru Blasters In Final
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ పై 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టీ20 టోర్నీ ఆద్యంతం బ్యాటింగ్‌తో అదరగొట్టిన మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. కరుణ్ నాయర్ 12 మ్యాచుల్లో 560 పరుగులు చేశాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కార్తీక్ (44 బంతుల్లో 71 పరుగులు), కరుణ్ నాయర్(45 బంతుల్లో 66 పరుగులు) హాఫ్ సెంచరీతో కదం తొక్కారు. ఆఖరిలో మనోజ్ భాండేజ్ 13 బంతుల్లోనే 44 పరుగులతో రాణించడంతో వారియర్స్ భారీ స్కోరు సాధించింది. బెంగళూరు బ్లాస్టర్స్ బౌలర్లలో జ్ఞానేశ్వర్ నవీన్ రెండు వికెట్లు తీయగా క్రాంతి కుమార్, శుభాంగ్ హెగ్దే చెరో వికెట్ పడగొట్టారు.
England : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఇంగ్లాండ్ అరుదైన ఘనత..
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో చేతన్ (32 బంతుల్లో 51), క్రాంతి కుమార్ (21 బంతుల్లో 39 నాటౌట్) రాణించారు. వారియర్స్ బౌలర్లలో విద్యాధర్ పాటిల్ మూడు వికెట్లు తీశాడు. కోదండ అజిత్ కార్తీక్, ధనుష్ గౌడ, కృష్ణప్ప గౌతమ్, దీపక్ దేవడిలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
విజేతగా నిలిచిన మైసూర్ వారియర్స్ జట్టులో టీమ్ఇండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. అయితే.. ఫైనల్లో అతడికి చోటు దక్కలేదు.
AUS vs IND : ఆ ఇద్దరు సీనియర్లు వద్దు.. ఈ ఇద్దరు కుర్రాళ్లే ముద్దు..
𝕋𝕙𝕖 𝕄𝕠𝕞𝕖𝕟𝕥 𝕠𝕗 𝔾𝕝𝕠𝕣𝕪! 🤩🏆#ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ #ShriramCapitalMaharajaTrophy #MaharajaTrophy #Season3@StarSportsKan pic.twitter.com/DB57vquoCb
— Maharaja Trophy T20 (@maharaja_t20) September 1, 2024