England : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఇంగ్లాండ్ అరుదైన ఘనత..
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది.

England Wins most matches in WTC history
ENG vs SL : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డులకు ఎక్కింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచులో 190 పరుగుల తేడాతో గెలుపొందిన తరువాత ఇంగ్లాండ్ ఈ రికార్డును అందుకుంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా జట్లను వెనక్కినెట్టింది.
శ్రీలంక పై విజయం డబ్ల్యూటీసీ చరిత్రలో ఇంగ్లాండ్‌కు 29 విజయం. 58 మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఈ విజయాలు సాధించింది. ఆ తరువాత భారత్, ఆస్ట్రేలియాలు చెరో 28 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. రెండు జట్లు కూడా 46 మ్యాచుల్లో దీన్ని అందుకున్నాయి. ఇక వీటి తరువాత న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లు ఉన్నాయి.
AUS vs IND : ఆ ఇద్దరు సీనియర్లు వద్దు.. ఈ ఇద్దరు కుర్రాళ్లే ముద్దు..
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్లు..
ఇంగ్లాండ్ – 29 విజయాలు
భారత్ – 28 విజయాలు
ఆస్ట్రేలియా – 28 విజయాలు
న్యూజిలాండ్ -15 విజయాలు
దక్షిణాఫ్రికా – 15 విజయాలు
పాకిస్తాన్ -10 విజయాలు
శ్రీలంక – 9 విజయాలు
వెస్టిండీస్ – 8 విజయాలు
బంగ్లాదేశ్ – 3 విజయాలు
ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ల్లో 196 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేయగా.. శ్రీలంక 292 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 190 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.