Babar Azam : పేరుకు తోపు ప్లేయర్.. గల్లీ ఆటగాడి కంటే దారుణంగా.. నెట్టింట బాబర్ ఆజాంపై ట్రోలింగ్
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు.
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. సొంత గడ్డ పై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 22 పరుగులు చేసిన బాబర్ రెండో టెస్టులో మాత్రం కాస్త ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసి పెలివియన్‌కు చేరుకున్నాడు. మరోసారి అతడు కీలక సమయంలో ఔట్ కావడంతో పాకిస్తాన్ కష్టాల్లో పడింది.
ఒకప్పుడు పాక్ తరుపున మూడు ఫార్మాట్లలోనూ బాబర్ అత్యుత్తమంగా రాణించాడు. ఓ దశలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో పోటీపడ్డాడు. అయితే.. గత రెండేళ్లుగా దారుణంగా విఫలం అవుతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. సుదీర్ఘ పార్మాట్‌లో అతడు హాఫ్ సెంచరీ చేయక 20 నెలలకు పైగా అవుతోంది. చివరిసారిగా అతడు 2022 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 పరుగులు చేశాడు.
Gautam Gambhir : రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలకు షాకిచ్చిన గంభీర్.. కోహ్లీకి చోటు..
గడిచిన 20 నెలల సమయంలో 16 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ 331 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 41 మాత్రమే. ఇలాంటి గణాంకాలు మరో ఆటగాడు నమోదు చేసి ఉంటే ఈ పాటికే జట్టులో చోటు కోల్పోయేవాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అతడిని జట్టు నుంచి తొలగించాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రావల్పిండి వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాకిస్తాన్‌కు 12 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్‌కు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో పాక్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగో రోజు లంచ్ విరామానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. రిజ్వాన్ (38), ఆగా సల్మాన్ (7) లు క్రీజులో ఉన్నారు.
Socha tha aaj khana khate khate Babar Azam ki inning(comeback )dekhunga lekin……..😅#BabarAzam𓃵 #BabarAzam pic.twitter.com/ladq5ztC29
— 𝗕𝗮𝗹𝘃𝗶𝗿 (@Balvir02) September 2, 2024
Another failure for Babar azam 💔
Perfect delivery on a good length that just shapes away from Babar hi nicksit to the slips 🥺#PakistanCricket #BabarAzam𓃵 #BabarAzam #PAKvsBAN#BabarAzam𓃵 pic.twitter.com/nRiG6N6QUx— PALAK GURJAR (@udayveersingh5) September 2, 2024
बबरी 🤡#BabarAzam #BabarAzam𓃵 #PAKvBAN #PAKvsBAN pic.twitter.com/Y55wWuWQqQ
— 𝗕𝗮𝗹𝘃𝗶𝗿 (@Balvir02) September 2, 2024