Gautam Gambhir : రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు షాకిచ్చిన గంభీర్.. కోహ్లీకి చోటు..

టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ ప్ర‌యాణం శ్రీలంక ప‌ర్య‌ట‌న‌తో ప్రారంభ‌మైంది.

Gautam Gambhir : రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు షాకిచ్చిన గంభీర్.. కోహ్లీకి చోటు..

Gautam Gambhir unveils his all time India XI no Rohit Sharma and Jasprit Bumrah

Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ ప్ర‌యాణం శ్రీలంక ప‌ర్య‌ట‌న‌తో ప్రారంభ‌మైంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో కోచ్‌గా అత‌డు మిశ్ర‌మ ఫ‌లితాలు అందుకున్నాడు. భార‌త జ‌ట్టు టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోగా వ‌న్డే సిరీస్‌లో ఓడిపోయింది. ప్ర‌స్తుతం గౌతీ త‌న త‌దుప‌రి స‌వాల్‌ల‌కు సిద్ధం అవుతున్నాడు. సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భార‌త జ‌ట్టు రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌రువాత న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల‌తో టెస్టు సిరీస్‌లు ఆడ‌నుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ ఫైన‌ల్ ఆడాలంటే.. ఈ సిరీసుల్లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించ‌డం ఎంతో ముఖ్యం.

లంక ప‌ర్య‌ట‌న త‌రువాత సుదీర్ఘం విరామం ల‌భించ‌డంతో గౌతీ ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఓ స్పోర్ట్స్ కీడా కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గంభీర్ భార‌త జ‌ట్టు ఆల్‌టైమ్ ఎలెవ‌న్‌ను ఎంచుకున్నాడు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు చోటు ఇవ్వ‌లేదు. త‌న జ‌ట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్, యువరాజ్ వంటి ఇతర దిగ్గజాలకు చోటు ఇచ్చాడు.

Ajinkya Rahane : న‌న్ను మ‌రిచిపోకండి.. నేనింకా రేసులోనే ఉన్నా.. సెల‌క్ట‌ర్ల‌కు అజింక్య ర‌హానే సందేశం!

ఓపెన‌ర్లుగా త‌న‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంచుకున్నాడు. వ‌న్‌డౌన్‌లో రాహుల్ ద్ర‌విడ్‌ను తీసుకున్నాడు. నాలుగో స్థానంలో స‌చిన్‌ను ఎంచుకున్నాడు. ఆ త‌రువాత విరాట్ కోహ్లీ, యువ‌రాజ్ సింగ్‌ల‌ను ఐదు, ఆరు స్థానాల్లో తీసుకున్నాడు. వికెట్ కీప‌ర్‌గా ధోనిని ఎంచుకున్నాడు. జ‌హీర్ ఖాన్‌, ఇర్ఫార్ ప‌ఠాన్‌ల‌ను ఫాస్ట్ బౌలింగ్ జాబితాలో అనిల్ కుంబ్లే, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ల‌ను స్పిన్ విభాగంలో చోటు క‌ల్పించాడు.

గంభీర్ ఆల్‌టైమ్ ఎలెవ‌న్..
వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌/ వికెట్‌ కీపర్‌), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్.

Yuvraj Singh : ధోనిని ఎన్న‌టికి క్ష‌మించ‌ను.. యువీ కెరీర్‌ను నాశ‌నం చేశాడు.. భారత రత్న ఇవ్వాల్సిందే..