Bangladesh vs India: రెండో టెస్టు మ్యాచులో ఆడనున్న రోహిత్ శర్మ‍!

బంగ్లాదేశ్ తో మీర్పూర్ లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి జరిగే రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో రోహిత్ శర్మకు గాయం కావడంతో అతడు ఆ తర్వాతి మ్యాచు నుంచి ఆడడం లేదన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఎడమచేతి బొటనవేలుకు గాయమైన నేపథ్యంలో అతడు చికిత్స తీసుకుని కోలుకున్నాడు.

Bangladesh vs India: బంగ్లాదేశ్ తో మీర్పూర్ లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి జరిగే రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో రోహిత్ శర్మకు గాయం కావడంతో అతడు ఆ తర్వాతి మ్యాచు నుంచి ఆడడం లేదన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఎడమచేతి బొటనవేలుకు గాయమైన నేపథ్యంలో అతడు చికిత్స తీసుకుని కోలుకున్నాడు.

అతడు రెండో టెస్టు మ్యాచులో ఆడే విషయంపై బీసీసీఐ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే, అతడు రెండో టెస్టులో ఆడేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మొదటి టెస్టు మ్యాచు కొనసాగుతోంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచు చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతోంది. ఓపెనర్లుగా క్రీజులోకి ఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ మొదటి టెస్టు మ్యాచు రెండు ఇన్నింగ్సుల్లోనూ వచ్చారు.

కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్సులో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 106/0 (37ఓవర్లకు)గా ఉంది. తొలి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్సును భారత్ 258/2 కు డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ మిగిలిన రెండు రోజుల్లో 407 పరుగులు చేయాల్సి ఉంది.

Supreme Court: అందుకేగా మేమున్నది.. వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

ట్రెండింగ్ వార్తలు