BBL 2025 Cricketer James Vince Accidentally Hits Seagull during Sydney Sixers Vs Melbourne Stars Match
క్రికెట్‌లో అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఫీల్డింగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఆటగాళ్లు ఒకరిని మరొకరు ఢీ కొనడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. తాజాగా ఓ హృదయవిదాకర ఘటన చోటు చేసుకుంది. బ్యాటర్ కొట్టిన ఓ బంతి తగిలి ఓ అరుదైన పావురం చనిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. గురువారం మెల్‌బోర్న్ వేదికగా మెల్ బోర్న్ స్టార్స్, సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మెల్‌బోర్న్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్‌వెల్ (32 బంతుల్లో 58 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో సిడ్నీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులకే పరిమితమైంది. సిడ్నీ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ (44 బంతుల్లో 53 పరుగులు) అర్థశతకంతో రాణించినా మిగిలిన వారు విఫలం అవ్వడంతో 16 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
ఇదిలా ఉంటే.. సిడ్నీ ఇన్నింగ్స్ సందర్భంగా హృదయవిదాకర ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను జోయెల్ ప్యారిస్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతికి విన్స్ భారీ షాట్ కొట్టాడు. బంతి గాల్లోకి లేచి బౌండరీ దిశగా వెళ్లింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న సీగల్ జాతికి చెందిన పావురాలు ఉన్నాయి. ఆ బంతి నేరుగా గుంపులోని ఓ పావురానికి నేరుగా తాకింది. ఆ పావురం పై పడిన బంతి బౌండరీకి వెళ్లింది.
బంతి నేరుగా తాకడంతో ఆ పావురం అక్కడికక్కడే కుప్పకూలింది. రెక్కలు కొన్ని ఊడిపోగా.. బాధతో విలవిలలాడింది. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి దాన్ని బయటకు తీసుకువెళ్లిపోయారు. అయితే.. అది ఆ వెంటనే చనిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో మైదానంలోని ప్రేక్షకులు, కామెంటేటర్స్, బంతి కొట్టిన విన్స్ అంతా షాక్ అయ్యారు.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఏకైక భారత మహిళా ప్లేయర్‌గా..
Seagull down 💀 and couldn’t save the boundary. #BBL pic.twitter.com/cfEoSmfKPV
— GrandmasterGamma (@mandaout12) January 9, 2025