Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఏకైక భారత మహిళా ప్లేయర్‌గా..
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.

Smriti Mandhana Creates History becomes fastest Indian woman to complete 4000 ODI runs
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఐరాండ్ల్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచులో స్మృతి ఈ ఘనత అందుకుంది. ఈ మ్యాచ్‌లో స్మృతి 29 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసింది. 95 ఇన్నింగ్స్‌ల్లోనే స్మృతి 4వేల పరుగులను పూర్తి చేసుకుంది. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది.
అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు చేసిన ప్లేయర్లు..
బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 86 ఇన్నింగ్స్‌ల్లో
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 87 ఇన్నింగ్స్‌ల్లో
స్మృతి మంధాన (భారత్) – 95 ఇన్నింగ్స్‌ల్లో
లారా వూల్వార్ట్ (దక్షిణాఫ్రికా) – 96 ఇన్నింగ్స్‌ల్లో
Virat Kohli : ఆస్ట్రేలియా నుంచి రాగానే భార్యా, పిల్లలతో కలిసి కోహ్లీ ఎక్కడికి వెళ్లారో చూశారా ?
కరెన్ రోల్టన్ (ఆస్ట్రేలియా) – 103 ఇన్నింగ్స్‌ల్లో
సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 105 ఇన్నింగ్స్‌ల్లో
స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్) – 107 ఇన్నింగ్స్‌ల్లో
టాంసిన్ బ్యూమాంట్ (ఇంగ్లాండ్) – 110 ఇన్నింగ్స్‌ల్లో
మిథాలీ రాజ్ (భారత్) – 112 ఇన్నింగ్స్‌ల్లో
డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్) – 112 ఇన్నింగ్స్‌ల్లో
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి వన్డేలోభారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో స్మృతి మంధాన సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ గాబీ లూయిస్ (92; 129 బంతుల్లో 15 ఫోర్లు), లేహ్ పాల్ (59; 73 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు, దీప్తి శర్మ, టిటాస్ సాధు, సయాలీ సత్ఘరే లు తలా ఓ వికెట్ సాధించారు.
Catch Of The Year : నువ్వు మనిషివా.. పక్షివా..! గాల్లో అమాంతం డైవ్ చేస్తూ..
అనంతరం లక్ష్యాన్ని భారత్ 34.3 ఓవర్లలో నాలుగు వికెట్లు ఛేదించింది. భారత బ్యాటర్లలో ప్రతీకా రావల్ (89; 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించింది. కెప్టెన్ స్మృతి మంధాన (41; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది.
ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.