Virat Kohli : ఆస్ట్రేలియా నుంచి రాగానే భార్యా, పిల్లలతో కలిసి కోహ్లీ ఎక్కడికి వెళ్లారో చూశారా ?
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Virat Kohli Visits Premanand Govind Sharan Maharaj with Family Ahead Of ICC Champions Trophy 2025
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విరుష్క దంపతులకు ఏ మాత్రం సమయం దొరికినా కూడా గుళ్లుగోపురాలతో పాటు ఆధ్యాత్మిక గురువు వద్దకు వెలుతుంటారు. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని భారత్‌కు వచ్చిన కోహ్లీ.. తన భార్య, పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతమైన బృందావన్ ధామ్‌ని సందర్శించారు.
పిల్లలు ఆకాయ్, వామికతో కలిసి విరుష్క దంపతులు శ్రీ ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ని కలిశారు. వారితో శ్రీ ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ ఆప్యాయంగా మాట్లాడారు. సుఖ సంతోషాలతో ప్రేమతో ఉండాలని వారిని ఆయన ఆశ్వీరదించారు. ఈ సందర్భంగా విరుష్క దంపతులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Manoj Tiwary – Gautam Gambhir : గంభీర్ పై తివారీ సంచలన ఆరోపణలు.. ‘నా ఫ్యామిలీని..’
కాగా.. శ్రీ ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ని విరుష్క దంపతులు కలవడం ఇదే తొలిసారి కాదు. 2023 జనవరిలోనూ కలిశారు.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌లో సతమతమవుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఘోరంగా విఫలం అయ్యాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఆఫ్ స్టంప్ బలహీనత మళ్లీ బయటపడింది. అతడు ఈ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతుండడంతో టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. టీమ్ఇండియా తన తదుపరి టెస్టు సిరీస్ జూన్‌లో ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ సిరీస్‌కు చాలా సమయం ఉంది.
KL Rahul : ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు కేఎల్ రాహుల్ దూరం..!
టెస్టుల సంగతి ఎలా ఉన్నా సరే.. వన్డేల్లో కోహ్లీ మ్యాచ్ విన్నర్. ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఇందులో కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2013 తరువాత భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ గెలవలేదు. కోహ్లీ రాణిస్తే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం పెద్ద కష్టం కాదని అంటున్నారు.
Virat Kohli और Anushka Sharma की पूज्य महाराज जी से क्या वार्ता हुई ? Bhajan Marg pic.twitter.com/WyKxChE8mC
— Bhajan Marg (@RadhaKeliKunj) January 10, 2025