Manoj Tiwary – Gautam Gambhir : గంభీర్ పై తివారీ సంచలన ఆరోపణలు.. ‘నా ఫ్యామిలీని..’
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై భారత మాజీ ఆటగాడు, కేకేఆర్ సహచరుడు మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు.

KKR Batsman Manoj Tiwary Made Allegations Against Gautam Gambhir Know the Details
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై భారత మాజీ ఆటగాడు, కేకేఆర్ సహచరుడు మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పటికే గంభీర్ పై విమర్శల జడివాన కురుస్తుండగా తివారీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గంభీర్ ను తివారి ఓ హిపోక్రైట్‌గా అభివర్ణించాడు. అతడు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని అన్నాడు. చెప్పిన దానిని అతడు అస్సలు పాటించడని అందుకనే అతడు కపట వ్యక్తి అని అన్నాడు.
విదేశాల నుంచి వచ్చే కోచ్‌లకు ఎలాంటి భావోద్వేగాలు, అనుభూతులు ఉండవని, వారు కేవలం డబ్బు సంపాదించుకోవడానికే వస్తారని, ఎంజాయ్ చేసి వెలుతారని గతంలో ఓ ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పాడు. మరి ఇప్పుడు అతడు చేసిన పని ఏమిటి? అతడు హెచ్ కోచ్‌గా ఉన్నాడు. సహాయక కోచులు భారతదేశానికి చెందిన వారిని తీసుకోవచ్చు. అయినా గానీ మోర్నీ మోర్నెల్, రైన్ టెన్ డస్కెటే లను తీసుకున్నాడు. అందుకనే గంభీర్ చేసే పనులకు చెప్పే మాటలకు పొంతన ఉండదు అని తివారి అన్నాడు. అందుకనే అతడిని హిపోక్రైట్ అని పిలుస్తానని చెప్పాడు.
KL Rahul : ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు కేఎల్ రాహుల్ దూరం..!
ఇక హెడ్ కోచ్‌గా గంభీర్ ఎలాంటి ఫలితాలు సాధించాడో అందరం చూస్తూనే ఉన్నాం. అతి తక్కువ సమయంలో భారత్ ఎక్కువ టెస్టులో ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ పోయింది ఓకే గానీ.. స్వదేశంలో కివీస్‌తో టెస్టు సిరీస్ ఓడిపోవడం ఏమిటి? ఆటల్లో గెలుపోటలు సహజం. కాని ఓడిపోయినప్పుడు సమీక్షించుకోవాలి. అప్పుడే మరోసారి అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. రాహుల్ ద్రవిడ్ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఆ బ్యాటన్‌ను గంభీర్ అందించారు. గంభీర్ జట్టును ముందుకు తీసుకువెళ్లాల్సి పోయి వెనక్కి మళ్లిస్తున్నట్లుగా అనిపిస్తోందని తివారీ అన్నాడు.
గతంలో గంభీర్ తన కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడినట్లు తివారి చెప్పాడు. రంజీ ట్రోఫీలో మేమిద్దరం కలిసి ఆడాం. ఢిల్లీ వేదికగా ఓ మ్యాచ్ జరిగింది. అప్పుడు గంభీర్ నా కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. సౌరవ్ గంగూలీని గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. ఆ సమయంలో ఇతర క్రికెటర్లు అతడిని కాపాడారు. లేదంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉండేదని అన్నాడు.