Tamim Iqbal : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. రెండో సారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Once again Tamim Iqbal Announces Retirement From international Cricket
Tamim Iqbal Retirement : బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ తరుపున తమీమ్ ఆడతాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడు రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తాను చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించాడు. ఈ నిర్ణయాన్నితాను ఎప్పుడో తీసుకున్నానని తెలిపాడు. అయితే.. తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఇదే సరైన సమయంగా భావించినట్లుగా చెప్పాడు.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఏకైక భారత మహిళా ప్లేయర్‌గా..
మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో తనపై చర్చలు ఉండకూడదనే తన నిర్ణయాన్ని చెప్పినట్లుగా తెలిపాడు. తాను ఎప్పుడో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు. అయితే మీడియా మాత్రం తనపై అనవసర చర్చలు పెట్టిందన్నారు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో తాను మళ్లీ జట్టులోకి రావాలని కోరినట్లుగా చెప్పాడు. సెలక్షన్ ప్యానెల్ కూడా తనతో మాట్లాడిందన్నాడు. అయితే.. తాను మాత్రం తన మనసు చెప్పిన మాటే వింటానని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అధ్యాయం ముగిందని వెల్లడించాడు.
రెండోసారి..
వాస్తవానికి తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం ఇది రెండో సారి. జూలై 2023లోనే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే.. వన్డే ప్రపంచకప్ 2023 దృష్ట్యా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సూచించింది. దీంతో తమీమ్ తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే.. ఆశ్చర్యకరంగా అతడికి వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి మరో మ్యాచ్ అతడు ఆడలేదు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని తీసుకోవాలని ప్రస్తుత కెప్టెన్ శాంటో కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి అతడు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
Catch Of The Year : నువ్వు మనిషివా.. పక్షివా..! గాల్లో అమాంతం డైవ్ చేస్తూ..
తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు సాధించాడు. టీ20ల్లో ఓ సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు.