BBL incredible attempt at a catch on the boundary rope by Hugh Weibgen
BBL : క్రికెట్‌లో అప్పుడప్పుడు కొందరు ఫీల్డర్లు చేసే విన్యాసాలు నమ్మశక్యం కానీ విధంగా ఉంటాయి. నిజంగా వీరేనా ఇలా చేసేది అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఓ ఫీల్డర్లు కూడా బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యం గానీ విధంగా వెనక్కి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
అయితే దురదృష్టం అతడి వెన్నంటే ఉంది. దానిని అంపైర్ సిక్సర్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బిగ్‌బాష్ లీగ్ 2025-26లో చోటు చేసుకుంది.
IPL 2026 : ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్లపై నిషేదం.. బీసీసీఐ ఏమన్నదంటే?
బిగ్‌బాష్ లీగ్ లో భాగంగా శుక్రవారం (జనవరి 2) బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ స్టార్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్క్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను బ్రిస్బేన్ హీట్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి మెల్‌బోర్న్ ఓపెనర్ సామ్ హార్పర్ థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి బౌండరీ లైన్ వద్దకు దగ్గరగా వెళ్లింది.
NO WAY!
One of the greatest catches that will never be 😭 #BBL15 pic.twitter.com/t3NNhXZ8WI
— KFC Big Bash League (@BBL) January 2, 2026
అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హ్యూ వైబ్జెన్ బంతి గమనాన్ని అంచనా వేస్తూ వెనక్కి పరిగెత్తి వెనక్కి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో చక్కని క్యాచ్ అందుకున్నాడు. అయితే.. అతడు క్యాచ్ అందుకున్న తరువాత తన వేగాన్ని నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌ను టచ్ చేశాడు. దీంతో అంపైర్ సిక్స్‌గా ప్రకటించాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ అతడు బౌండరీ లైన్ టచ్ చేయకపోయి ఉంటే క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిఉండేదని కామెంటేటర్లు అన్నారు.