IPL 2026 : ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్లపై నిషేదం.. బీసీసీఐ ఏమన్నదంటే?
ఐపీఎల్‌లో (IPL 2026) బంగ్లాదేశ్ ప్లేయర్లను ఆడనివ్వకూడదని, వారిపై నిషేదం విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
participation of Bangladesh players in the Indian Premier League
- ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్లపై నిషేదం విధించాలనే డిమాండ్లు
- స్పందించిన బీసీసీఐ
- ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదు
IPL 2026 : ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో ముస్తాఫిజుర్ ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన బంగ్లాదేశ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. వేలంలో అతడు కనీస ధర 2 కోట్లతో ఎంట్రీ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే.. గత కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి. ఇటీవల ఆ దేశంలోని కొద్ది నేతలు భారత్ పై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు హిందువులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి.
Virat kohli : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు..
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ప్లేయర్లను ఆడనివ్వకూడదని, వారిపై నిషేదం విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేలంలో ముస్తాఫిజుర్‌ను కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
కాగా.. బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్‌లో ఆడనివ్వకుండా చేయాలని వస్తున్న డిమాండ్ల పై బీసీసీఐ స్పందించింది. ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొనకుండా నిషేదం విధించాలనే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం నుంచి రాలేదని బీసీసీఐ తెలిపినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ తెలిపింది.
‘దీనిలోకి మనం రాకూడదు. అది మన చేతుల్లో లేదు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు IPL లో పాల్గొనకుండా నిరోధించాలని ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సమాచారం అందలేదు.. ప్రస్తుతానికి పెద్దగా వ్యాఖ్యానించలేను.’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు పేర్కొంది.
ఇక ముస్తాఫిజుర్ రెహమాన్ విషయానికి వస్తే.. 2016లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ద్వారా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. వివిధ జట్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుసున మొత్తం ఇప్పటి వరకు 60 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 8.13 ఎకానమీతో 65 వికెట్లు పడగొట్టాడు.
