BCCI announced Schedule for Afghanistan Tour of India (pic credit @BCCI)
IND vs AFG : ఈ ఏడాది జూన్‌లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య భారత్‌తో అఫ్గాన్ జట్టు ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది.
జూన్ 6 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుండగా.. జూన్ 14 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నో, చెన్నై లలో అఫ్గాన్ జట్టు ఆడనుంది.
🚨 News 🚨
Here’s a look at the schedule for Afghanistan Men’s Team’s tour of India in June 2026 🗓️
Details ▶️ https://t.co/OkJVip4AhJ#TeamIndia | #INDvAFG pic.twitter.com/CQhIliTf2E
— BCCI (@BCCI) March 2, 2026
భారత దేశంలో అఫ్గానిస్థాన్ పర్యటన షెడ్యూల్ ఇదే..
* ఏకైక టెస్టు మ్యాచ్ – జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్ వేదికగా
వన్డే సిరీస్ షెడ్యూల్..
* తొలి వన్డే – జూన్ 14న (ధర్మశాల)
* రెండో వన్డే – జూన్ 17న (లక్నో)
* మూడో వన్డే – జూన్ 20న (చెన్నై)
Sunil Gavaskar : ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఇలాంటివి అవసరమా..
వన్డే మ్యాచ్‌లు అన్ని డే అండ్ మ్యాచ్‌లు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.