BCCI announces India A squad for England tour
India squad: ఇంగ్లాండ్ తో టీమిండియా ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ కంటే ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో భారత్ – ఎ జట్టు తలపడనుంది. దీంతో ఇంగ్లాండ్ టూర్ కు భారత్ -ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 18మంది సభ్యుల జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, తనుష్ కోటియన్ , సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ లతోపాటు పలువురికి చోటు దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ ఈ జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. వైస్ కెప్టెన్ గా ధ్రువ్ జురెల్ వ్యవహరిస్తాడు.
భారత్ -ఎ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ తో మూడు ఫస్ట్ -క్లాస్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లు మే 30 నుంచి జూన్ 16వ తేదీ వరకు జరుగుతాయి. అయితే, కాంటర్బరీ, నార్తాంప్టన్ లలో జరగనున్న రెండు మ్యాచ్ లకు సంబంధించిన భారత్ -ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. బెకెన్‌హామ్ లో జరిగే మూడో మ్యాచ్ కు టీమిండియా పూర్తిస్థాయి టెస్టు జట్టు బరిలోకిదిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ హర్ష్ దుబే కూడా ఈ జట్టులో భాగమయ్యాడు. మరో ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలాఉంటే.. శుభమన్ గిల్, సాయి సుదర్శన్ జూన్ 6న మొదలయ్యే రెండో మ్యాచ్ కు అందుబాటులోకి వస్తారని తెలుస్తోంది. ఐపీఎల్ లో వీళ్లద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే
ఇండియా A మ్యాచ్‌లు
♦ ఇంగ్లాండ్ లయన్స్ v ఇండియా A – మే 30-జూన్ 2, కాంటర్బరీ
♦ ఇంగ్లాండ్ లయన్స్ v ఇండియా A – జూన్ 6-9, నార్తాంప్టన్
♦ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ – జూన్ 13-16, బెకెన్‌హామ్
ఇంగ్లాండ్ vs ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్
♦ మొదటి టెస్ట్ – జూన్ 20-24, హెడింగ్లీ
♦ రెండవ టెస్ట్ – జూలై 2-6, ఎడ్జ్‌బాస్టన్
♦ మూడవ టెస్ట్ – జూలై 10-14, లార్డ్స్
♦ నాల్గవ టెస్ట్ – జూలై 23-27, ఓల్డ్ ట్రాఫోర్డ్
♦ ఐదవ టెస్ట్ – జూలై 31-ఆగస్టు 4, ది ఓవల్
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
India A’s squad for tour of England announced.
All The Details 🔽
— BCCI (@BCCI) May 16, 2025