టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20, వన్డేల మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. పేటీఎం హోం సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13వరకు ఐదు వన్డేలు, రెండు టీ20 సిరీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి.
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20, వన్డేల మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. పేటీఎం హోం సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13వరకు ఐదు వన్డేలు, రెండు టీ20 సిరీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి. బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ముందుగా రెండు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం వన్డే సిరీస్ జరుగుతుంది. టీ20 మ్యాచ్ లు రాత్రి 7 గంటలకు, 50 ఓవర్ల ఫార్మాట్ వన్డేల మ్యాచ్ లు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతాయి. టీ20 మ్యాచ్ లు ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 27వరకు బెంగళూరు, విశాఖపట్నం వేదికగా జరుగుతాయి.
హైదరాబాద్ వేదికగా తొలి వన్డే..
అలాగే ఐదు వన్డే మ్యాచ్ లు మార్చి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. మార్చి 5న నాగ్ పూర్ వేదికగా రెండో వన్డే, మార్చి 8న రాంచి వేదికగా మూడో వన్డే, మార్చి 10న నాల్గో వన్డే , మార్చి 13న ఐదో వన్డే జరుగనుంది. చివరి రెండు వన్డేలకు మొహాలి, ఢిల్లీ వేదికగా మ్యాచ్ లు జరుగనున్నాయి. మధ్యలో టీమిండియా న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ కు రానుంది. ఇక్కడే ఆసీస్, భారత్ జట్ల మధ్య టీ20, వన్డేల సిరీస్ సమరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తో తొలి టెస్టు సిరీస్ సాధించిన భారత జట్టుగా కోహ్లీసేన చారిత్రక రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 12 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు జసప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పించగా.. అతడి స్థానంలో హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ షిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.