BCCI extends Ajit Agarkar contract as chairman of selection committee
Ajit Agarkar : చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నమ్మకాన్ని ఉంచింది. అతడు చీఫ్ సెలక్టర్ పదవిలో 2026 జూన్ వరకు కొనసాగనున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడి భవిష్యత్తు పై చర్చ జరిగిందని, కానీ బీసీసీఐ అతడిపై నమ్మకాన్ని ఉంచి అతడి పదవి కాలాన్ని పొడింగించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఐపీఎల్ 2025 సీజన్ కన్నా ముందే బీసీసీఐ తీసుకుందని, అగార్కర్ కూడా అప్పటి వరకు చీప్ సెలెక్టర్‌గా కొనసాగేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ (Ajit Agarkar ) నియమితులైనప్పటి నుంచి భారత్ దేశం రెండు ఐసీసీ ట్రోఫీలను అందుకుంది. టీ20 ప్రపంచకప్ 2024 ను సొంతం చేసుకోగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్‌కు జాక్ పాట్..! టీ20 జట్టులో చోటు దక్కకపోయినా..
‘అగార్కర్ పదవికాలంలో భారత జట్టు ఐసీసీ టైటిళ్లను గెలుచుకుంది. అదే సమయంలో టెస్టులు, వన్డేల్లోనూ పరివర్తన దశను దాటుకుంది. బీసీసీఐ అతడి కాంట్రాక్టును 2026 జూన్ వరకు పొడిగించింది. కొద్ది నెలల క్రితమే అతడు ఈ ఆఫర్‌ను అంగీకరించాడు.’ అని ఓ బీసీసీఐ అధికారి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
అగార్కర్ పదవికాలంలో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులతో పాటు టీ20లకు వీడ్కోలు పలికారు. ఇక అశ్విన్ మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోగా, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో ఈ సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం ఓ సవాల్‌గా మారింది. అయినప్పటికి అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో భారత జట్టు సంది దశను దాటింది.
The Hundred 2025 : వామ్మో.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు..
వచ్చే నెలలో సెలక్షన్ కమిటీలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. పురుషుల సెలక్షన్ కమిటీలో అగార్కర్, ఎస్ఎస్ దాస్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ ఉన్నారు. సెప్టెంబర్‌లో జరిగే వార్షిక జనరల్ బాడీ సమావేశంలో కమిటీలో కొన్ని మార్పులు చేయవచ్చని కూడా నివేదిక సూచిస్తుంది. శరత్ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో దాస్, బెనర్జీ సెలక్షన్ కమిటీలో కొనసాగుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.