×
Ad

BCCI : క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల‌కు ఇక పండ‌గే.. మ్యాచ్ ఫీజులను భారీగా పెంచిన బీసీసీఐ.. ఆర్థికంగా సెట్‌!

దేశ‌వాళీ మ‌హిళా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ (BCCI) శుభ‌వార్త చెప్పింది. వారి మ్యాచ్ ఫీజుల‌ను భారీగా పెంచింది.

BCCI hikes domestic match fees for women cricketers

BCCI : దేశ‌వాళీ మ‌హిళా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ శుభ‌వార్త చెప్పింది. వారి మ్యాచ్ ఫీజుల‌ను భారీగా పెంచింది. గ‌తంతో పోలిస్తే దాదాపు 2.5 రెట్లు పెరిగాయి. ఈ నిర్ణ‌యం కార‌ణంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అమ్మాయిల ఆర్థిక స్థిర‌త్వం పెర‌గ‌నుంది. ఈ పెంపును బీసీసీఐ (BCCI ) అపెక్స్ కౌన్సిల్ ధ్రువీక‌రించింది.

* సీనియర్ మహిళల దేశవాళీ వన్డే టోర్నీ, మల్టీ టీమ్ టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయ‌ర్లు రోజుకు రూ.50 వేలు అందుకోనున్నారు. ఇంత‌క‌ముందు ఈ ఫీజు రూ.20 వేలు ఉండేది. ఇక‌ రిజర్వ్ ఆట‌గాళ్ల‌కి రూ.25 వేలు చెల్లించ‌నున్నారు.

AUS vs ENG : ఒక్క మ్యాచ్‌కే కెప్టెన్ ఔట్‌.. నాలుగేళ్ల త‌రువాత ఆ ఆట‌గాడికి చోటు.. నాలుగో టెస్టుకు ఆసీస్ ఊహించ‌ని మార్పులు..

* దేశవాళీ టీ20 టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు రూ.25 వేలు ఇస్తారు. అదే విధంగా రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 మ్యాచ్ ఫీజుగా దక్కనుంది.

* అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు సీజన్‌లో రూ.12 నుంచి రూ.14 లక్షల ఆదాయం ద‌క్క‌నుంది. ఇక అండర్ 23, అండర్ 19లో ఆడే అమ్మాయిలకు రోజుకు రూ.25 వేలు, రిజర్వ్‌ల‌కు రూ.12,500 అంద‌నున్నాయి.

U19 Asia Cup 2025 : ఫైన‌ల్‌లో పాక్ చేతిలో ఘోర ఓట‌మి.. బీసీసీఐ సీరియ‌స్‌.. ఇక‌..

అంపైర్లు, రిఫ‌రీల ఆదాయం కూడా..

దేశవాళీ అంపైర్లు, రిఫరీల ఆదాయాన్ని కూడా బీసీసీఐ భారీగా పెంచింది. ఇక పై అంపైర్లు రోజుకు రూ.40 వేలు అందుకోనున్నారు. నాకౌట్ మ్యాచ్‌లకైతే మ్యాచ్ ప్రాధాన్యతను బట్టి రూ.50 వేల నుంచి రూ.60 వేల వ‌ర‌కు ఉంటుంది. ఈ లెక్క‌న ఓ అంపైర్ రంజీ ట్రోఫీలో లీగ్ మ్యాచ్‌ల‌కు ఒక్కొ మ్యాచ్‌కు రూ.1.60ల‌క్ష‌లు, అదే నాకౌట్ మ్యాచ్‌ల‌కు రూ.2.5ల‌క్ష‌ల నుంచి రూ.3ల‌క్ష‌లు అందుకోనున్నాడు.