IPL 2025
IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తల కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ పున: ప్రారంభం అవుతుంది. మే17వ తేదీ (శనివారం) నుంచి తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్ -18సీజన్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే, ఈ సీజన్ అర్ధంతరంగా నిలిచిపోవటంతో విదేశీ ఆటగాళ్లు చాలామంది తమ దేశాలకు వెళ్లిపోయారు. వెళ్లిన వాళ్లలో మళ్లీ ఐపీఎల్ లో ఆడేందుకు తిరిగొచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉంది.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు వచ్చే నెల 11 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్స్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు అంతర్జాతీయ సిరీస్ లు ఉన్నాయి. దీంతో ఆ దేశాల ఆటగాళ్లలో చాలామంది రెండు రోజుల్లో పున:ప్రారంభం అవుతున్న ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిణామాలతో ఐపీఎల్ లోని పలు జట్లకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో ఈ సీజన్ వరకు నిబంధనల్లో మార్పులు చేసింది.
ఈసారి ఐపీఎల్ అనూహ్య పరిస్థితుల్లో ఆగి, మళ్లీ మొదలవుతున్న నేపథ్యంలో లీగ్ నిబంధనల్లో బీసీసీఐ కీలక మార్పు చేసింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్ లో జట్టు 12వ మ్యాచ్ తరువాత కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడానికి అవకాశం లేదు. గాయం, ఇతర కారణాలతో జట్టు ప్లేయర్ లీగ్ కు దూరమైతే 12వ మ్యాచ్ లోపే ప్రత్యామ్నాయ ప్లేయర్ ను తీసుకోవటానికి వీలుంటుంది. అయితే, ఈ సారి బీసీసీఐ ఆ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ సీజన్ వరకు 12 మ్యాచ్ ల తరువాత కూడా కొత్త ఆటగాళ్లను ఎంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో తమ దేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు లీగ్ కోసం తిరిగొచ్చే అవకాశం లేకపోవటంతో తాత్కాలిక ఒప్పందాలకు బీసీసీఐ అకాశమిచ్చింది.
అర్థంతరంగా ఐపీఎల్ నిలిచిపోవటంతో చాలామంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. వాళ్లలో చాలా మంది తిరిగొచ్చే అవకాశం లేకపోవటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయంతో ఐపీఎల్ లోని చాలా జట్లకు భారీ ఉపశమనం లభించినట్లయింది.
🚨 TEMPORARY REPLACEMENTS IN IPL 🚨
– IPL teams can pick temporary replacement due to the unavailability of certain overseas stars but the replacements are not eligible for retention for IPL 2026. [Cricbuzz] pic.twitter.com/Jjrvqe0nn6
— Johns. (@CricCrazyJohns) May 14, 2025
#TATAIPL is back in action on 17th May 🗓
With the playoff race heating up, which fixture are you most excited for? 🙌
Check out the full schedule 🔽 pic.twitter.com/OoRlYEpAUb
— IndianPremierLeague (@IPL) May 14, 2025