Parmanand maharaj : విరాట్ కోహ్లీ దంపతులు ఆశీర్వాదం తీసుకున్న ప్రేమానంద్ జీ మహారాజ్ ఎవరు..? ఆయన గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవే..

ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం.. ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ..

Parmanand maharaj : విరాట్ కోహ్లీ దంపతులు ఆశీర్వాదం తీసుకున్న ప్రేమానంద్ జీ మహారాజ్ ఎవరు..? ఆయన గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవే..

Parmanand ji maharaj

Updated On : May 14, 2025 / 2:32 PM IST

Parmanand maharaj : టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరునాడే తన సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కశర్మతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్‌ దామ్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్‌ జీ మహారాజ్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారు ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కలవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. విరాట్ దంపతులు ప్రేమానంద్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికితోడు గతంలో బాలీవుడు ప్రముఖులు, పలు రంగాల ప్రముఖులు ప్రేమానంద్ జీ మహారాజ్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Also Read: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు సర్వంసిద్ధం.. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే పుష్కరాలు.. ఇక్కడ విశిష్ఠత ఏమిటంటే..? పురాణాల ప్రకారం..

ప్రేమానంద్ జీ మహారాజ్ ఎవరు..?
ప్రేమానంద్ జీ మహారాజ్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. చిన్ననాటి పేరు అనిరుధ్ కుమార్ పాండే. ఆయన త‌ల్లిదండ్రులు శంభు పాండే, రమా దేవి. ముందుగా ప్రేమానంద్‌ తాతయ్య సన్యాసం తీసుకున్నారు. తండ్రి కూడా దైవ భక్తుడు. అతని అన్నయ్య కూడా ప్రతిరోజూ భగవత్ పారాయణం చేసేవారు. ప్రేమానంద్ కుటుంబంలో ఎప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. ప్రేమానంద్ జీ మహారాజ్ గ‌తంలో ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. ‘‘తాను 5వ తరగతిలో ఉన్నప్పుడు గీత చదవడం ప్రారంభించాను. ఆ త‌రువాత‌ నెమ్మదిగా ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతూ వ‌చ్చింది. 13 సంవత్సరాల వయస్సులో సాధువుగా మారాలని నిర్ణయించుకున్నా. ఆ త‌రువాత ఇంటిని విడిచిపెట్టి సన్యాసిగా మారాను’’ అని తెలిపారు. ఆ తరువాత వారణాసికి వెళ్లి అక్కడ తన జీవితాన్ని ప్రారంభించారు. తన దైనందిన జీవితంలో అతను రోజుకు మూడుసార్లు గంగానదిలో స్నానం చేసి, తులసి ఘాట్ వద్ద శివుడిని, గంగా తల్లిని ధ్యానం చేసి పూజించేవారు. రోజుకు ఒకసారి మాత్రమే తినేవారు. ఈ క్ర‌మంలో ఓ సాదువు వ‌చ్చి బృందావనానికి ఆహ్వానించారు. బృందావనానికి వెళ్లిన‌ తరువాత రాధా వల్లభ శాఖలో కూడా చేరారు. ఆ త‌రువాత ఆధ్యాత్మిక గురువు శ్రీ గౌరంగి శరణ్ మహారాజ్ మార్గనిర్దేశంలో ప్రేమానంద్ మహారాజ్ రాధావల్లభ‌ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తన బోధన‌ల ద్వారా రాధాకృష్ణుల లోతైన భ‌క్తిభావాన్ని వివ‌రిస్తూ వ‌స్తున్నారు.

Also Read: Virat Kohli : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే కోహ్లీ ఎక్క‌డికి వెళ్లాడో చూశారా?

సోషల్ మీడియాలో ఆదరణ..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం.. ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా చెబుతుంటారు. ఎలా బతకాలి, సమస్యల్ని ఎలా అధిగమించాలో వివరిస్తుంటారు. భజనలు, ఉపన్యాసాలతో ఎంతో మంది భక్తులకు ఆయన చేరువయ్యారు. భక్తి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ సమస్యలకు పరిష్కారాలకోసం ప్రేమానంద్‌ను కలుస్తుంటారు. ఆయ‌న ఆధ్యాత్మిక బోధ‌న‌లకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచుతుంటారు. త‌ద్వారా ఆ వీడియోలు సోషల్ మీడియాలో అపారమైన ప్రజాదరణ పొందాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల మంది ఫాలోవర్లతో ప్రేమానంద్ మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అనుసరించే ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లోనూ భారీ సంఖ్య‌లో ఫాలోవర్లు ఉన్నారు.

 


విరాట్, అనుష్కతోపాటు ఎందరో ప్రముఖులు..
ప్రేమానంద్ మహారాజ్ జీ నిస్వార్థ స్వభావం, భక్తి ఆయనకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అనేక మంది ప్రముఖులు ఆయన ఆశీర్వాదాలు పొందారు. వీరిలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మతోపాటు బాలీవుడ్ ప్రముఖులు రణ్ వీర్ సింగ్, అంగదే బేడీ, సునీల్ శెట్టి, విక్కీ కౌశల్, నటి హేమ మాలినితోపాటు రెజ్లర్ గ్రేట్ ఖలీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు.