Virat Kohli : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన మరుసటి రోజే కోహ్లీ ఎక్కడికి వెళ్లాడో చూశారా?
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సోమవారం టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Virat Kohli First Act After Test Retirement Is A Spiritual One
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సోమవారం టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో కోహ్లీ ఎన్నో ఘనతలను సాధించాడు. కాగా.. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు.
ఉత్తరప్రదేశ్ లోని బృంధావన్ ధామ్‌కు వెళ్లారు. అక్కడ స్వామి ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. కాగా.. విరుష్క జంట గతంలోనూ చాలా సార్లు బంధావన్ ధామ్‌ను సందర్శించారు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత విరాట్ కోహ్లీ పాల్గొన్న మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇదే. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cheteshwar Pujara : కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? పుజారా కీలక వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన తరువాత పొట్టి ఫార్మాట్‌కు కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టెస్టులకు రిటైర్ కావడంతో అతడు ఇక వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు. టెస్టు క్రికెట్‌లో అతడు 123 మ్యాచ్‌లు ఆడాడు. 46.9 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254 నాటౌట్.
Virat Kohli & Anushka Sharma से पूज्य महाराज जी की क्या वार्तालाप हुई ? Bhajan Marg pic.twitter.com/7IWWjIfJHB
— Bhajan Marg (@RadhaKeliKunj) May 13, 2025
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265 పరుగులు), సునీల్ గవాస్కర్ (10,122 పరుగులు) భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.