Australia : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. బుమ్రా బౌలింగ్‌ను చితక్కొట్టిన యువ ఆటగాడికి చోటు..
డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది.

Australia unveil full strength squad for WTC 2025 final against South Africa
జూన్ 11 ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు వెస్టిండీస్ పర్యటన కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
పాట్ కమిన్స్ నేతృత్వంలోనే ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని జట్టుకు దూరమైన కామెరూన్ గ్రీన్ దాదాపు ఏడాది తరువాత తిరిగి వచ్చాడు. అతడితో పాటు శ్రీలంక పర్యటనకు గాయం కారణంగా దూరమైన జోష్ హేజిల్‌వుడ్, కెప్టెన్ కమిన్స్‌లు సైతం చోటు దక్కించుకున్నారు.
SRH : ఓరి నాయనో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కష్టం..! కావ్య పాప ఇప్పుడేమి చేస్తుందో?
Introducing our squad for the 2025 ICC World Test Championship Final and the Qantas Men’s Test Tour of the West Indies 👊 pic.twitter.com/kZYXWKpQgL
— Cricket Australia (@CricketAus) May 13, 2025
ఆస్ట్రేలియా ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలలో సీనియర్లు, యువకులు ఉన్నారు. కెప్టెన్ కమ్మిన్స్ తో పాటు మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, హేజిల్ వుడ్ లు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పిన్ విభాగంలో అనుభవజ్ఞుడైన నాథన్ లియాన్ , ఎడమచేతి వాటం బౌలర్ మాట్ కుహ్నెమాన్ ఉన్నారు.
ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లతో కూడా బ్యాటింగ్ విభాగం 1ఎంతో పటిష్టంగా ఉంది. భారత్‌తో సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేసిన సామ్ కాన్స్టాస్ తో పాటు బ్యూ వెబ్‌స్టర్ లకు చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్ లు ఎంపికయ్యారు.
డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్ టూర్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే..
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
ట్రావెలింగ్ రిజర్వ్ : బ్రెండన్ డాగెట్