IPL 2025 : శనివారం నుంచి ఐపీఎల్ రీస్టార్ట్.. హైద‌రాబాద్‌కు అన్యాయం! ఉప్ప‌ల్ నుంచి మ్యాచ్‌ల‌ త‌ర‌లింపు..

ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునఃప్రారంభం కానుంది.

IPL 2025 : శనివారం నుంచి ఐపీఎల్ రీస్టార్ట్.. హైద‌రాబాద్‌కు అన్యాయం! ఉప్ప‌ల్ నుంచి మ్యాచ్‌ల‌ త‌ర‌లింపు..

IPL 2025 Revised Schedule no matchs in Uppal stadium

Updated On : May 13, 2025 / 10:11 AM IST

భార‌త్‌, పాకిస్థాన్ ల మ‌ధ్య ఉద్రిక్త‌ల కార‌ణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునఃప్రారంభం కానుంది. స‌వ‌రించిన షెడ్యూల్‌ను బీసీసీఐ సోమ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. లీగ్ ద‌శ‌లో మిగిలిన 13 మ్యాచ్‌ల‌ను ఆరు వేదిక‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు.

బెంగ‌ళూరు, జైపూర్‌, ఢిల్లీ, ల‌క్నో, అహ్మ‌దాబాద్‌, ముంబై లు మిగిలిన లీగ్ మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల వేదిక‌ల‌ను త‌రువాత ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది.

ఆర్‌సీబీ, కోల్‌క‌తా జ‌ట్ల మ‌ధ్య బెంగ‌ళూరు వేదిక‌గా శ‌నివారం జ‌రిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది. జూన్ 3న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భ‌ద్ర‌తాకార‌ణాల‌తో ర‌ద్దైన పంజాబ్‌, ఢిల్లీ మ్యాచ్‌ను మ‌ళ్లీ నిర్వ‌హించ‌నున్నారు.

ENG vs IND : కోహ్లీ, రోహిత్ ల రిటైర్‌మెంట్‌.. అజింక్యా ర‌హానే, పుజ‌రాల‌కు గోల్డెన్ ఛాన్స్‌.. బ్యాక్ డోర్ ఎంట్రీ ఖాయం..!

ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గాల్సిన రెండు మ్యాచ్‌ల‌ను ఇత‌ర వేదిక‌ల‌కు త‌ర‌లించారు. దీంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులు ఎంతో నిరాశ‌కు గురి అయ్యారు. వాస్త‌వానికి ఉద్రిక‌త్తల నేప‌థ్యంలో ద‌క్షిణ‌భార‌త దేశంలోనే మిగిలిన లీగ్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో హైద‌రాబాద్‌, వైజాగ్‌ల‌లో ఎక్కువ మ్యాచ్‌లు జ‌రిగే ఛాన్స్ ఉంద‌ని క్రికెట్ ప్రేమికులు భావించారు.

అయితే.. ఐపీఎల్ రీ షెడ్యూల్‌లో బెంగ‌ళూరు మిన‌హా ద‌క్షిణాభార‌త‌దేశంలోని మ‌రే న‌గ‌రానికి మ్యాచ్‌ల‌ను కేటాయించ‌లేదు. వ‌ర్షాల ప్ర‌భావంతోనే బీసీసీఐ ఇలా చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ఇదే..

మే 17 – ఆర్‌సీబీ వ‌ర్సెస్‌ కేకేఆర్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)
మే 18 – రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్‌ పంజాబ్ కింగ్స్ – జైపూర్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 18 – ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్‌ గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 19 – లక్నో సూపర్ జెయింట్స్ వ‌ర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 20 – చెన్నై సూపర్ కింగ్స్ వ‌ర్సెస్‌ రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 21 – ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై (రాత్రి 7:30 గంటలకు)
మే 22 – గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్‌ లక్నో సూపర్ జెయింట్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30 గంటలకు)

Virat Kohli-Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల వ‌న్డే భ‌విష్య‌త్తు పై సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌ర‌ట‌..

మే 23 – ఆర్‌సీబీ వ‌ర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)
మే 24 – పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 25 – గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్‌ చెన్నై సూపర్ కింగ్స్ – అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 25 – సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్‌ కేకేఆర్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 26 – పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్‌ ముంబై ఇండియన్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 27 – లక్నో సూపర్ జెయింట్స్ వ‌ర్సెస్‌ ఆర్‌సీబీ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 29 – క్వాలిఫయర్ 1 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
మే 30 – ఎలిమినేటర్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 1 – క్వాలిఫయర్ 2 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 3 – ఫైనల్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)