Ravindra Jadeja : చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. కపిల్ దేవ్, కలిస్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజాలకు సాధ్యం కాలేదు..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు.

Jadeja created history in Test cricket became the first all rounder in the world to do so
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం పాటు నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తాజాగా (మే 14న) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జడేజా తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
2022 మార్చి 9న వెస్టిండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్‌ను వెనక్కి నెట్టి రవీంద్ర జడేజా టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. నాటి నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 38 నెలలు (1152 రోజులు) పాటు నంబర్ వన్ ర్యాంక్‌లోనే జడేజా కొనసాగుతున్నాడు. కపిల్ దేవ్, జాక్వస్ కలిస్, ఇమ్రాన్ వంటి దిగ్గజ ఆల్‌రౌండర్లకు సైతం ఇలాంటి రికార్డు సాధ్యం కాలేదు.
Sunil Gavaskar : శనివారం నుంచి ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. నో చీర్ గర్ల్స్, నో డ్యాన్స్, నో డీజే..
36 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు 2022 మార్చి నుంచి 23 టెస్టులు ఆడాడు. 36.71 సగటుతో 1175 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, ఐదు అర్థశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లో 91 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు సార్లు 5 వికెట్ల ప్రదర్శన, రెండు సార్లు 10 వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఇక ఓవరాల్‌గా జడేజా ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 80 టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో 34.7 సగటుతో 3370 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు 22 అర్థశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లో 323 వికెట్లు పడగొట్టాడు.
RCB : కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్ షాక్.. కప్పు కొడదామనుకుంటే..!
తాజా ర్యాంకింగ్స్‌లో జడేజా తరువాతి స్థానాల్లో మెహిది హసన్ మిరాజ్, మార్కో జన్సెన్ లు ఉన్నారు.
ఐసీసీ టెస్ట్ టాప్-5 ఆల్‌రౌండర్లు వీరే..
రవీంద్ర జడేజా (భారత్) – 400 రేటింగ్ పాయింట్లు
మెహిదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్) – 327 రేటింగ్ పాయింట్లు
మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 271 రేటింగ్ పాయింట్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 253 రేటింగ్ పాయింట్లు