Sunil Gavaskar : శనివారం నుంచి ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. నో చీర్ గర్ల్స్, నో డ్యాన్స్, నో డీజే..
శనివారం నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ కానున్న నేపథ్యంలో సునీల్ గవాస్కర్ ఓ సూచన చేశాడు.

Sunil Gavaskar urges BCCI to resume IPL 2025 without DJs and cheer girls
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ శనివారం (మే 17) నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఐపీఎల్ పాలక మండలి, బీసీసీఐకి ఓ సూచన చేశాడు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల మనోభావాలను గౌరవించాలని, ఛీర్ లీడర్స్, డ్యాన్సులు, డీజేలు పెట్టకుండా మ్యాచులు నిర్వహించాలని కోరాడు.
ప్రజలు.. ఐపీఎల్ మ్యాచులను ఎంజాయ్ చేయడానికి ఆట మాత్రం చాలు అని చెప్పాడు. ‘ఎన్నో కుటుంబాలు, తమ ఆత్మీయులను కోల్పోయాయి. భారత ఆర్మీ సైనికులు, మన కోసం ప్రాణ త్యాగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం డీజే పెట్టుకుని, ఛీర్ లీడర్స్‌తో డ్యాన్సులు వేయించుకుంటూ ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు.’ అని గవాస్కర్ అన్నాడు.
RCB : కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్ షాక్.. కప్పు కొడదామనుకుంటే..!
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్ ప్రకారం.. ఆరు వేదికల్లో (బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై.) 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 27 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 29న క్వాలిఫైయర్, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న రెండో క్వాలిఫైయర్ జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది.
కాగా.. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు.
Rohit Sharma : మహారాష్ట్ర సీఎంతో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయాల్లోకి హిట్‌మ్యాన్..?
ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ఇదే..
మే 17 – ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)
మే 18 – రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ – జైపూర్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 18 – ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 19 – లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 20 – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 21 – ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై (రాత్రి 7:30 గంటలకు)
మే 22 – గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30 గంటలకు)
మే 23 – ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)
మే 24 – పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 25 – గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ – అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 25 – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 26 – పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 27 – లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్‌సీబీ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 29 – క్వాలిఫయర్ 1 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
మే 30 – ఎలిమినేటర్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 1 – క్వాలిఫయర్ 2 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 3 – ఫైనల్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)