Rohit Sharma : మ‌హారాష్ట్ర సీఎంతో రోహిత్ శ‌ర్మ భేటీ.. రాజ‌కీయాల్లోకి హిట్‌మ్యాన్‌..?

రోహిత్ శ‌ర్మ మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను క‌లుసుకున్నాడు.

Rohit Sharma : మ‌హారాష్ట్ర సీఎంతో రోహిత్ శ‌ర్మ భేటీ.. రాజ‌కీయాల్లోకి హిట్‌మ్యాన్‌..?

Rohit Sharma gets honoured by Maharashtra CM Devendra Fadnavis

Updated On : May 14, 2025 / 11:48 AM IST

టీమ్ఇండియా స్టార్ క్రికెట్ రోహిత్ శ‌ర్మ ఇటీవ‌లే టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన వారం రోజుల త‌రువాత రోహిత్ శ‌ర్మ మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను క‌లుసుకున్నాడు. ముంబైలోని ముఖ్య‌మంత్రి నివాసం వ‌ర్ష‌లో వీరి భేటీ జ‌రిగింది. దీంతో హిట్‌మ్యాన్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌నున్నాడు అనే ఊహాగానాలు మొద‌లు అయ్యాయి.

38 ఏళ్ల రోహిత్ శ‌ర్మ ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం వర్షలో ఆయ‌న్ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా భార‌త టెస్టు జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ చేసిన సేవ‌ల‌ను ఫ‌డ్న‌వీస్ కొనియాడారు. ఈ స‌మావేశానికి సంబంధించిన ఫోటోల‌ను సీఎం త‌న సోష‌ల్ మీడియా పోస్ట్‌లో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

SRH : స‌న్‌రైజ‌ర్స్ ఊపిరి పీల్చుకో.. కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు..!

‘నా అధికారిక నివాసం వర్షలో భారత క్రికెటర్ రోహిత్ శర్మను స్వాగతించడం, కలవడం సంభాషించడం చాలా బాగుంది. టెస్ట్ క్రికెట్‌కు ఆయ‌న చేసిన సేవ‌ల అభినంద‌నీయం. త‌దుప‌రి ఆయ‌న కొత్త అధ్యాయంలో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఇందుకు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు.’ అని ఫ‌డ్న‌వీస్ రాసుకొచ్చారు.

2013లో కోల్‌క‌తాలో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో రోహిత్ శ‌ర్మ అరంగ్రేటం చేశాడు. తొలుత మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడిన హిట్‌మ్యాన్ ఆపై ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొంది అక్క‌డ రాణించాడు. మొత్తంగా హిట్‌మ్యాన్ టీమ్ఇండియా త‌రుపున 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 40.57 స‌గ‌టుతో 4301 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 18 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

BCCI : బీసీసీఐకి బిగ్ షాక్‌.. ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ కీల‌క నిర్ణ‌యం.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఎంత ప‌ని చేసింది..

కాగా.. రోహిత్ శ‌ర్మ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన రోజుల వ్య‌వ‌ధిలోనే అత‌డి స‌హ‌చ‌రుడు, స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ కూడా టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. రో-కో ద్వ‌యం నిష్ర్క‌మించ‌డంతో టెస్టు క్రికెట్‌లో ఓ శ‌కం ముగిసిన‌ట్లైంది.

ఇదిలా ఉంటే.. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత చాలా మంది రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణించారు. మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, యూసుఫ్ పఠాన్, గౌతమ్ గంభీర్ వంటి వారు రాజకీయాల్లో రాణించిన సంగ‌తి తెలిసిందే.