SRH : సన్‌రైజర్స్ ఊపిరి పీల్చుకో.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ శనివారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఓ వారం పాటు టోర్నీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. లీగ్‌ను వాయిదా వేయడంతో విదేశీ ఆటగాళ్లు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ రీ షెడ్యూల్ ను విడుదల చేసినప్పటికి విదేశీ ఆటగాళ్ల రాకపై స్పష్టత లేదు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది.
ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతడి మేనేజర్ నీల్ మాక్స్‌వెల్ వెల్లడించాడు.
‘ఫ్రాంచైజీ కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌కు ఓ బాధ్యత ఉంది. అతను తిరిగి జట్టులోకి రావాలని చూస్తున్నాడు.’ అని నీల్ మాక్స్‌వెల్ న్యూస్ కార్ప్‌తో మాట్లాడుతూ చెప్పాడు.
దీంతో కమిన్స్ విషయంలో ఓ స్పష్టత వచ్చింది. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ అతడే ఎస్ఆర్‌హెచ్‌ను నడిపించనున్నాడు. అదే సమయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సైతం జట్టుతో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. వీరిద్దరు జూన్ 11 నుంచి 15 వరకు దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ 2023-25) ఫైనల్ మ్యాచ్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక అయ్యారు.
ఈ సీజన్‌లో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్రమించింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ -1.192గా ఉంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్.. క్లారిటీ ఇచ్చిన షమీ..
లీగ్ దశలో సన్‌రైజర్స్ మరో మూడు మ్యాచ్‌లు మే 19న లక్నో సూపర్ జెయింట్స్, మే 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 25న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది. ఎలాగో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ కు చేరకపోవడంతో ఐపీఎల్ 2025లో మే25న సన్‌రైజర్స్ తన చివరి మ్యాచ్ ఆడనుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు సన్నద్ధం అయ్యేందుకు కమిన్స్, ట్రావిస్ హెడ్‌లకు తగినంత సమయం దొరకనుంది.