×
Ad

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ గాయంపై బీసీసీఐ కీల‌క అప్‌డేట్‌.. జ‌ట్టుతో పాటు గౌహ‌తి వెళ్తాడు గానీ..

కోల్‌క‌తా వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill )గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

BCCI provides update on Shubman Gill injury ahead of 2nd Test against southafrica

Shubman Gill : కోల్‌క‌తా వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ సంద‌ర్భంగా స్వీప్ షాట్ ఆడే క్ర‌మంలో గిల్ (Shubman Gill) మెడ ప‌ట్టేసింది. వెంట‌నే మైదానాన్ని వీడిన అత‌డు ఆస్ప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు కోలుకుంటున్నాడు.

మెడ‌నొప్పి విప‌రీతంగా ఉండ‌డంతో అత‌డు ప్ర‌యాణాలు చేయ‌కూడ‌ని, ఈ క్ర‌మంలోనే అత‌డు శ‌నివారం (న‌వంబ‌ర్ 22) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఆడ‌డం క‌ష్ట‌మేన‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు భారీ షాక్‌.. వ‌న్డేల్లో చేజారిన..

కాగా.. తాజాగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుభ్‌మ‌న్ గిల్ గాయంపై అప్‌డేట్ ఇచ్చింది. ‘ద‌క్షిణాఫ్రికాతో కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట‌లో శుభ్‌మ‌న్ గిల్ మెడ‌కు గాయ‌మైంది. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించాము. ఒక రోజు చికిత్స అనంత‌రం అత‌డు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.’ అని తెలిపింది.

India A vs South Africa A : శ‌త‌కాల‌తో చెల‌రేగిన ద‌క్షిణాఫ్రికా-ఏ బ్యాట‌ర్లు.. భార‌త్‌-ఏ టార్గెట్ ఎంతంటే?

అత‌డు వైద్య చికిత్స‌కు బాగానే స్పందిస్తున్నాడ‌ని తెలిపింది. నవంబ‌ర్ 19న‌ (బుధ‌వారం) అత‌డు జ‌ట్టుతో క‌లిసి గౌహ‌తి వెళ్తాడ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం అత‌డు బీసీసీఐ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు పేర్కొంది. ఇక రెండో టెస్టులో అత‌డు ఆడ‌తాడా? లేదా? అన్న విష‌యం పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపింది.