India A vs South Africa A : శ‌త‌కాల‌తో చెల‌రేగిన ద‌క్షిణాఫ్రికా-ఏ బ్యాట‌ర్లు.. భార‌త్‌-ఏ టార్గెట్ ఎంతంటే?

మూడు మ్యాచ్‌ల అన‌ధికారిక వ‌న్డే సిరీస్‌లో భాగంగా భార‌త్‌-ఏ, ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్ల మధ్య (India A vs South Africa A)రాజ్‌కోట్ వేదిక‌గా మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది.

India A vs South Africa A : శ‌త‌కాల‌తో చెల‌రేగిన ద‌క్షిణాఫ్రికా-ఏ బ్యాట‌ర్లు.. భార‌త్‌-ఏ టార్గెట్ ఎంతంటే?

India A vs South Africa A 3rd unofficial ODI Team India target is 327

Updated On : November 19, 2025 / 2:13 PM IST

India A vs South Africa A : మూడు మ్యాచ్‌ల అన‌ధికారిక వ‌న్డే సిరీస్‌లో భాగంగా భార‌త్‌-ఏ, ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్ల మధ్య రాజ్‌కోట్ వేదిక‌గా మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో (India A vs South Africa A) టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా-ఏ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 326 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్లు లువాన్ డ్రే ప్రిటోరియస్ (123; 98 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), రివాల్డో మూన్సామి (107; 130 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు.

Mushfiqur Rahim : చ‌రిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్.. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఒకే ఒక్క‌డు..

వీరిద్ద‌రు తొలి వికెట్‌కు 241 ప‌రుగుల రికార్డు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. మిగిలిన వారిలో డెలానో పాట్జీటర్ (30 నాటౌట్‌), డయాన్ ఫారెస్టర్ (20)రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.