IND vs ENG : అబుదాబిలో ఇంగ్లాండ్ జట్టు ఏం చేస్తుందో తెలుసా?

మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

England team leaves India after losing 2nd Test

IND vs ENG : విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ 106 ప‌రుగుల తేడాతో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో పాటు మిగిలిన ఇంగ్లాండ్ టీమ్ మొత్తం భార‌త్‌ను విడిచి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

మూడో టెస్టు ప్రారంభానికి 10 రోజుల స‌మ‌యం ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అబుదాబి వెళ్లి అక్క‌డ ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ త‌రువాత మూడో టెస్టుకు అన్ని విధాలు సిద్ద‌మై తిరిగి భార‌త్‌కు రానున్నట్లు ఆ జ‌ట్టు మేనేజ్‌మెంట్ తెలియ‌జేసింది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ 28 ప‌రుగుల‌తో విజయం సాధించింది.

అద్భుతంగా పుంజుకున్న భార‌త్ విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో 106 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్ర‌స్తుతం 1-1తో స‌మంగా ఉంది. రాజ్‌కోట్ వేదిక‌గా ఫిబ్ర‌వరి 15 నుంచి మూడో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

AUS vs WI : చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 6.5 ఓవ‌ర్ల‌లో ముగిసిన వ‌న్డే!

కాగా.. భార‌త ప‌ర్య‌ట‌న‌కు ముందు ఇంగ్లాండ్ జ‌ట్టు అబుదాబీకి వెళ్లింది. ఉప‌ఖండ‌పు పిచ్‌ల‌పై రాణించేందుకు అబుదాబీ పిచ్‌ల‌పై ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు తీవ్రంగా సాధ‌న చేశారు. భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎలా ఎదుర్కొవాల‌నే దానిపైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు