Ben Stokes : రాంచీ టెస్టు ముందు బెన్‌స్టోక్స్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇదేం పిచ్‌రా బాబు!

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రాంచీ వేదిక‌గా శుక్ర‌వారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.

Ben Stokes reacts to Ranchi pitch ahead of IND vs ENG 4th Test

Ben Stokes – Ranchi pitch : ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రాంచీ వేదిక‌గా శుక్ర‌వారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. భార‌త్ 2-1 ఆధిక్యంలో ఉండ‌డంతో సిరీస్‌లో నిల‌బ‌డాలంటే రాంచీలో విజ‌యం సాధించ‌డం ఇంగ్లాండ్‌కు ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో కీల‌క‌మైన ఈ మ్యాచ్‌కు ముందు ఆ జ‌ట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ రాంచీ పిచ్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌న కెరీర్‌లో ఇలాంటి పిచ్‌ను ఎన్న‌డూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చాడు.

పిచ్‌ను చూసి ఓ అభిప్రాయానికి రాలేక‌పోతున్న‌ట్లు తెలిపాడు. ఓ వైపు నుంచి చూస్తే పిచ్ పై ప‌చ్చిక క‌నిపిస్తోంద‌ని, మ‌రో ఎండ్ నుంచి చూస్తే చిన్న చిన్న ప‌గ‌ళ్లు క‌నిపిస్తున్నాయ‌ని అన్నాడు. అస‌లు ఈ పిచ్‌పై మ్యాచ్ ఎలా సాగుతుందో అర్థం కావ‌డం లేద‌న్నాడు. త‌న‌కైతే ఇప్ప‌టి వ‌ర‌కు ఏం అర్ధం కాలేద‌న్నాడు. దీని గురించి ఇంత‌కంటే ఎక్కువ ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

Delhi Capitals : ఇది గ‌మ‌నించారా? ఢిల్లీ మ్యాచులు విశాఖ‌లో ? పంత్ మెరుపులు చూడొచ్చు!

జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్‌..

పిచ్‌ను చూసి అంచ‌నాకు రాలేక‌పోతున్నామ‌ని చెప్పినప్ప‌టికీ త‌మ సంప్రదాయాన్ని మాత్రం ఇంగ్లాండ్ కొన‌సాగించింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది. పేస్ బౌల‌ర్ మార్క్‌వుడ్‌తో పాటు స్పిన్న‌ర్ రెహాన్ అహ్మ‌ద్‌ల‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది. ఓలీ రాబిన్స‌న్‌, షోయ‌బ్ బ‌షీర్‌ల‌కు చోటు ఇచ్చింది. ఈ సిరీస్‌లో రాబిన్స‌న్‌కు ఇదే తొలి మ్యాచ్ కానుంది. విశాఖ మ్యాచ్‌లో అరంగ్రేటం చేసిన బ‌షీర్‌ను రాజ్‌కోట్ టెస్టుకు త‌ప్పించింది. మ‌ళ్లీ రాంచీ టెస్టుకు తుది జ‌ట్టులో ఇంగ్లాండ్ చోటు ఇచ్చింది.

వ‌రుస‌గా విఫ‌లం అవుతున్నా కూడా స్టార్ ఆట‌గాడు జానీ బెయిర్ స్టో పై జ‌ట్టు మేనేజ్‌మెంట్ న‌మ్మ‌కం ఉంచింది. బౌలింగ్ విభాగంలో రెండు మార్పులు చేసిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయ‌లేదు.

రాంచీ టెస్టుకు ఇంగ్లాండ్ తుది జ‌ట్టు ఇదే..

జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్( కెప్టెన్ ), జానీ బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్ ( వికెట్ కీపర్ ), టామ్ హార్ట్లీ, ఓలీ ఓలీ రాబిన్స‌న్‌, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్.

European T10 cricket : టీ10 క్రికెట్‌లో ప్ర‌పంచ రికార్డు.. 21 బంతుల్లోనే సెంచ‌రీ..

ట్రెండింగ్ వార్తలు