ఇలా కూడా బౌలింగ్ చేస్తారా, వీడియో వైరల్

ఇలా కూడా బౌలింగ్ చేస్తారా, వీడియో వైరల్

Updated On : January 18, 2021 / 8:12 PM IST

Bharatanatyam style off spin : క్రికెట్ లో బౌలింగ్ వేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. బాల్ ను చేతిలో పట్టుకుని విచిత్రంగా బౌలింగ్ చేస్తుంటారు. కొంతమంది వివాదాన్ని కూడా కొని తెచ్చుకున్నారు. అయితే..ఓ బౌలర్ విచిత్రంగా బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భరతనాట్యం చేసే వారిలా..రెండు..మూడు సార్లు గిరగిరా..తిరుగుతూ..బంతిని వేస్తున్నాడు. ఈ వీడియోను భారత క్రికెటర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.

ఈ వీడియో ఎక్కడిది ? ఎవరు వేశారు ? అనేదానిపై ఎలాంటి వివరాలు పొందుపర్చలేదు. భరతనాట్యం స్టైల్ లో బౌలింగ్ చేయడం అంటూ క్యాప్షన్ జత చేశారు యువరాజ్. దీనిని హర్బజన్ సింగ్ కు షేర్ చేస్తూ..ఏమంటావ్ భజ్జీ అంటూ పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటికే మూడు లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ బౌలర్ బంతికంటే ఎక్కువగానే తిరుగుతున్నాడు..అంటూ కామెంట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)