BBL : ప్ర‌మాద‌క‌రంగా మారిన పిచ్‌.. 6 ఓవ‌ర్ల త‌రువాత మ్యాచ్ ర‌ద్దు.. ఇదేం తొలిసారి కాదు..

Big Bash League : పిచ్ ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది.

Big Bash League Melbourne Renegades vs Perth Scorchers match abandoned due to unsafe pitch

పిచ్ ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ ల మ‌ధ్య ఆదివారం మ్యాచ్ ఆరంభ‌మైంది. టాస్ గెలిచిన మెల్‌బోర్న్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పెర్త్ స్కార్చర్స్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. కాగా.. ఇన్నింగ్స్ రెండో బంతికే స్టీపెన్ డ‌కౌట్ అయ్యాడు. మ‌రికాసేప‌టికే మ‌రో ఓపెన‌ర్ కూప‌ర్ (6) పెవిలియ‌న్ చేరుకున్నాడు.

దీంతో 18 ప‌రుగుల‌కే పెర్త్ రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఆరోన్ హార్డీ (20 నాటౌట్‌), జోష్ ఇంగ్లిష్ (3 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు. కాగా.. ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్ విల్ స‌ద‌ర్లాండ్ వేశాడు. అత‌డు మూడు బంతుల‌ను ఒకే లెంగ్త్ వ‌ద్ద వేశాడు. అయితే.. మూడు బంతులు కూడా అనూహ్య‌మైన బౌన్స్ అయ్యాయి. బ్యాటర్లతో సహా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంత‌క‌ముందు కూడా ప‌లు మార్లు ఇలాగే జ‌రిగింది.

ప్ర‌మాద‌క‌రంగా పిచ్‌..

దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇద్ద‌రు కెప్టెన్లు ఆరోన్ ఫించ్‌, నిక్ మాడిన్‌స‌న్ తో చ‌ర్చ‌లు జ‌రిపారు. పిచ్ చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని, మ్యాచ్ కొన‌సాగిస్తే ఆట‌గాళ్లు గాయ‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావించారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ్యాచ్ ను నిలిపివేసే స‌మ‌యానికి పెర్త్ జ‌ట్టు 6.5 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు న‌ష్ట‌పోయి 30 ప‌రుగులు చేసింది.

WI vs ENG : చారిత్రాత్మ‌క విజ‌యం.. 24 ఏళ్ల త‌రువాత ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచిన వెస్టిండీస్..

నిన్న రాత్రి భారీ వ‌ర్షం కురింది. పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పారు. అయిన‌ప్ప‌టికీ క‌వ‌ర్స్ నుంచి నీరు లీక్ అయ్యి పిచ్ పై చేరడంతోనే ఇలా జ‌రిగి ఉంటుంద‌ని ఆరోన్ పిచ్ మ్యాచ్ అనంత‌రం మాట్లాడుతూ చెప్పాడు. ఇదిలా ఉంటే.. శనివారం జరగాల్సిన అడిలైడ్ స్ట్రైకర్స్ – బ్రిస్బేన్ హీట్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దైన సంగ‌తి తెలిసిందే. వ‌ర్షం కార‌ణంగా ఆ మ్యాచ్ ర‌ద్దు కాగా.. నేడు వ‌ర్షం ముప్పు లేక‌పోయినా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో అభిమానులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లోనూ..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి కార‌ణంతో మ్యాచులు ర‌ద్దు అయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి.. 2007లో భార‌త్‌, శ్రీలంక జ‌ట్లు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచులో పిచ్ అనూహ్యంగా స్పందిస్తుండ‌డంతో మ్యాచును ర‌ద్దు చేశారు. అంతక‌ముందు 1998లో వెస్టిండీస్‌లోని జ‌మైకా మైదానంలో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచ్ కూడా ర‌ద్దు అయ్యింది. 11 ఓవ‌ర్ల ఆట అనంత‌రం పిచ్ ఆట‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో ర‌ద్దు చేశారు.

Ajaz Patel : విచిత్ర బౌల‌ర్‌.. స్వ‌దేశంలో నో వికెట్.. కానీ విదేశాల్లో 62 వికెట్లు..! భార‌త సంత‌తి ఆట‌గాడే

ట్రెండింగ్ వార్తలు